లండన్ మహానగరంలో ‘మూడు దారులు’ పుస్తకావిష్కరణ !

👉ఏపీ ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్ కలం నుంచి జాలువారిన…


J.SURENDER KUMAR,

ప్రముఖ జర్నలిస్టు ఏపీ ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్ తన స్వీయ అనుభవంతో ఉన్నది ఉన్నట్టుగా, అవాస్తవాలు, కల్పితాలకు తావు లేకుండా, రాసిన ‘ మూడు దారులు ‘ పుస్తకావిష్కరణ లండన్ మహానగరంలో చేయడం చాలా సంతోషంగా ఉందని ప్రభాకర్ అన్నారు.
ముగ్గురు ముఖ్యమంత్రులు వైఎస్సార్, చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డిల రాజకీయ ప్రస్థానాన్ని అమర్ ఎంతో విశదంగా, వివరంగా తన పుస్తకంలో పొందుపరిచారని ప్రభాకర్ అవుతాల అభిప్రాయపడ్డారు.

దేవులపల్లి అమర్ రచించిన ‘మూడు దారులు’ పుస్తకాన్ని ప్రవాసాంధ్రులు లండన్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణలతోపాటు, ఆంధ్రప్రదేశ్ విభజన గురించి కూడా ఈ పుస్తకంలో అమర్ ఎన్నో విషయాలు ప్రస్తావించారని చెబుతూ ఈ పుస్తకం అందరూ చదవదగినదని అన్నారు.


లండన్ లో స్థిరపడిన పాండిచ్చేరి వాస్తవ్యుడు షాన్ పద్మనాభన్ మాట్లాడుతూ, తనకు తెలుగు రాజకీయాల పట్ల మక్కువ ఎక్కువనీ, ఈ పుస్తకాన్ని చదివి తనకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నాననీ చెప్పారు. అలాగే తమిళనాడు వాస్తవ్యుడైన డాక్టర్ శ్రీనివాసన్ జనార్దన్ కూడా మూడు దారులు పుస్తకం ఆద్యంతం చదివించేదిగా ఉందన్నారు. డాక్టర్ ప్రదీప్ చింత మాట్లాడుతూ, మూడు దారులు పుస్తకం చదువుతుంటే అమర్ దేవులపల్లికి రాజకీయాలపై గల విస్తృత పరిజ్ఞానం, జర్నలిస్టుగా ఆయనకున్న అనుభవం తనకు ఆశ్చర్యం కలిగించాయన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ పెండేకంటి తదితరులు పాల్గొన్నారు.