మహా శాస్త్రవేత్త గెలీలీ గెలీలియో..!

👉 గెలీలీ గెలీలియో జయంతి సందర్భంగా..


                      ****

భూమి ఒక గ్రహమని, ఇది సూర్యుడి చుట్టూ తిరుగుతూ వుంటుందని అనేక మంది శాస్త్రవేత్తలు రుజువు చేశారు. వీరిలో కోపర్ని కస్ ముఖ్యుడు. ఈయన ప్రతిపాదించిన సిద్ధాంతమే సూర్య కేంద్ర సిద్ధాంతంగా ప్రాచుర్యం పొందింది. దీనిని గెలీలియో వంటి వారు సమర్థించారు.

పూర్వం విశ్వానికి భూమి కేంద్రం అని నమ్మేవారు. మత గ్రంథాలు కూడా అదే విషయాన్ని ప్రచారం చేశాయి. ఇది చరిత్రలో భూ కేంద్ర సిద్ధాంతంగా ప్రాచుర్యం పొందింది.
గెలీలియో ఇటలీలోని పీసా నగరంలో  1564 ఫిబ్రవరి 15న జన్మించాడు. చిన్న వయసులో తండ్రి వద్దనే విద్యాభ్యాసం చేశాడు. తరువాత పీసా విశ్వవిద్యాలయంలో వైద్య విద్యార్థిగా చేరాడు. అయితే అక్కడి గణితశాస్త్ర ఉపన్యాసాలకు ప్రభావితుడై వైద్యవిద్యను విడిచి, గణిత శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. ఆ తరువాత అక్కడే గణితశాస్త్రంలో ఉపన్యాసకులుగా చేరాడు.
ఆయన ఖగోళ శాస్త్రం లో అనేక ఆవిష్కరణలు చేశారు. శని, గురు గ్రహాలపై పరిశోధనలు చేశాడు. వాటి ఉప గ్రహాల వునికిని గుర్తించాడు. టెలిస్కోప్ ను కనుగొన్నాడు.
ఆయన పరిశోధనలను
1632లో వెలువడిన ఈ “Dialogues concerning the two chief world systems” అనే గ్రంథం లో పొందు పరిచాడు. నిర్భయంగా తాను వాస్తవమని నమ్మిన శాస్త్రీయ విషయాలను ఇందులోవెల్లడించాడు. అయితే ఈ గ్రంథాన్ని ప్రజలు కోపర్నికస్ సిద్ధాంతాన్ని సమర్ధించేదిగా భావిస్తున్నారని తెలుసుకున్న మతాధికారులు దీని ప్రచురణను నిలిపివేయడమే కాకుండా గెలీలియోకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. 1637లో గెలీలియో గ్రుడ్డివాడయ్యాడు. ఇంతటి మహానుభావుడు శిక్షను అనుభవిస్తూనే 1642, జనవరి 8 తేదీన తన 78వ ఏట మరణించారు. శాస్త్రీయ వాస్తవాలను తెలియజేసి ఈ ప్రపంచమంతా వెలుగులు నింపాలని ప్రయత్నించిన ఒక మహా మనిషిని మూర్ఖత్వం బలిగొంది.


వ్యాసకర్త:  యం. రాం ప్రదీప్, తిరువూరు
మొబైల్: 9492712836