👉జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి..
👉పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు…
J.SURENDER KUMAR,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలనీ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మంచిర్యాల టిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పై బాల్క సుమన్ చెప్పు చూపిస్తూ అసభ్య పదజాలంతో దుషిస్తూ ప్రజాస్వామ్యం ను అపహాస్యం చేసేలా, రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిని అవమానించేలా మాట్లాడడం ఆయన దురహంకారం కు నిదర్శనం అన్నారు. ఆయన చెప్పు లేపి, ఉపయోగించిన భాషా, మాటలు వివిధ ఛానల్, దినపత్రికలల్లో వచ్చాయని వాటిని సాక్ష్యంగా సేకరించి క్రిమినల్ కేసు నమోదు చేయాలనీ డిమాండ్ చేశారు.

అంతకు ముందు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కళ్లేపల్లి దుర్గయ్య ,మాట్లాడుతూ దళిత కార్డు ముసుగులో సీఎం కేసీఆర్ కు బానిసలాగా వ్యవహరించే బాల్క సుమన్ కు సీఎం రేవంత్ రెడ్డి ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. అధికారం పోయిందని అనే అసూయా, అసహనం, అహంకారంతో, ఇష్టరీతిన మాట్లాడుతున్న సుమన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం దుర్గయ్య కాంగ్రెస్ నాయకులతో కలిసి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదును అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం , మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గయ్య , కాంగ్రెస్ అనుబంధం సంఘాల బాధ్యులు, నాయకులు బొల్లి శేఖర్, దయాల శంకర్ , రవీందర్ రెడ్డి, గాజుల రాజేందర్, రమేష్ రావు , యూత్ కాంగ్రెస్ నాయకులు సామ్రాట్, వంశీ, గుండ మధు బీరం రాజేష్, నాగేంద్ర, మహేష్, మన పూరి నరేష్, అత్త ఉల్లా నదీమ్, సంతోష్ రాజి బాబా ,ప్రదీప్, హరీష్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి బల్క సుమన్ క్షమాపణ చెప్పాలి

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బేషరతుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగక్షమాపణ చెప్పాలని ధర్మపురి కాంగ్రెస్ శ్రేణులు నాయకులు మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు.
మంగళవారం స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు దినేష్ మాట్లాడుతూ..
త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో మాజీ సీఎం కేసీఆర్ మెప్పు పొంది పోటీ చేయాలనే ఉద్దేశంతో సుమన్ ఇలా మాట్లాడారు అన్నారు. ఒకవేళ టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన చిత్తుచిత్తుగా ఓడించడం ఖాయమని దినేష్ అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వేముల రాజేష్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సింహరాజ్ ప్రసాద్, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు రఫియోద్ధిన్, టౌన్ యూత్ అధ్యక్షులు తిరుపతి, సుముక్, ఐ NSU అసెంబ్లీ అధ్యక్షులు శ్రవణ్, రాపర్తి సాయికిరణ్, టౌన్ బిసి సెల్ అధ్యక్షులు వొజ్జల లక్ష్మణ్, అశేట్టి శ్రీనివాస్, శ్రీపతి సత్యనారయణ, గణేష్, నరేష్, రాజేష్, ప్రశాంత్, రాజయ్య, శ్రీకాంత్, శశి, గోపి, అభి, పోషన్న, రమణ, రవి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు