J.SURENDER KUMAR,
మాజీ సీఎం కేసీఆర్ కు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్, లక్ష్మణ్ కుమార్ పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు.

మాజీ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు గురువారం ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, కెసిఆర్ కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణం చేయించారు.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు-2023 ఫలితాలు గత నెలలో ప్రకటించిన కొద్ది రోజులకే మాజీ ముఖ్యమంత్రి కి జరిగిన ప్రమాదంలో ఎముక విరిగింది . పూర్తిగా కోలుకోవడం తో వాకింగ్ స్టిక్ సహాయంతో, మాజీ సీఎం ఆ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకుని స్పీకర్ ఛాంబర్‌కు చేరుకున్నారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కేసీఆర్‌తో స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మాజీ సీఎం కేసీఆర్ కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత ఛాంబర్‌ను సందర్శించి పూజలు చేశారు. శాసనసభ వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్‌బాబు, మాజీ మంత్రులు-వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వి.శ్రీనివాస్‌గౌడ్, మాజీ స్పీకర్ పి.శ్రీనివాస్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్‌కుమార్, శాసనమండలి కార్యదర్శి వి.నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.