J.SURENDER KUMAR,
మరికొద్ది రోజుల్లో 2024 సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగనుంది. మార్చి రెండో వారంలో ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
త్వరలో జరగబోయే 2024 లోక్‌సభ ఎన్నికల తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు దాదాపు పూర్తయినట్లు సమాచారం. లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ మార్చి రెండో వారం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని జాతీయ మీడియాలో వార్తలు స్క్రోలింగ్ అవుతున్నాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ సమావేశం మంగళవారం పాట్నాలో జరిగింది
లోక్‌సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది.
మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించండి!

ఎన్నికల సంఘం అధికారులతో సమావేశం సందర్భంగా తాము మూడు సూచనలు చేశామని జేడీయూ నేత రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్) తెలిపారు. గతంలో మాదిరిగా ఏడు దశల్లో కాకుండా మూడు దశల్లోనే ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లు ఎక్స్ లో వెల్లడించారు. భద్రత బలగాలు మోహరింపుపై కూడా పలు సూచనలు చేసినట్లు ఆయన తెలిపారు. గత లోక్‌సభ ఎన్నికలకు 2019 మార్చి 10న షెడ్యూల్‌ను ప్రకటించారు. ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. మే 23న ఓట్ల లెక్కంపు చేపట్టారు.