ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ను ఫోన్ లో పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి !

J. SURENDER KUMAR,

సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని లక్ష్మణ్ కుమార్ కు ధైర్యం చెప్పారు.

మంత్రి పొన్నం ప్రభాకర్..


మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సోమవారం సాయంత్రం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి కి వెళ్లి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ను పరామర్శించారు. ఎమ్మెల్యే ఆరోగ్యం పై వైద్యులను మంత్రి వివరాలు అడిగారు. ప్రమాదం ఏమీ లేదని త్వరలో కోలుకుంటారు అని వైద్యులు మంత్రికి వివరించారు.

ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేల పరామర్శ !


హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ను,ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య , విశాఖ ఇండస్ట్రీ ఎండి యువజన కాంగ్రెస్ నాయకులు గడ్డం వంశి తదితరులు లక్ష్మణ్ కుమార్ ను పరామర్శించారు.