J.SURENDER KUMAR,
మంచిర్యాల జిల్లా లక్షట్ పేట్ పట్టణంలో ఈనెల 26 ( సోమవారం ) నుండి ఐదు రోజులపాటు ”చతుర్వేద సహకార పురస్సర శత చండి పయుక్త అతిరుద్ర మహాయాగం” జరగనున్నది.

ఈ యాగం లోక కళ్యాణమ్ తో పాటు సనాతన ధర్మరక్షణ నిమిత్తం నిర్వాహకులు పట్టణంలోని మహానంద టాకీస్ ఎదురుగా జరపనున్నారు.
దాదాపు 200 మంది వేద పండితులతో ఐదు రోజులపాటు రుద్రాభిషేకం, రుద్ర హవనము చతుర్వేద సహకారములు శత చండి పారాయణం జరగనున్నాయి.

వేద పండితులు, చికిలి ఆగస్త్య శాస్త్రి ఘనపాటి, వశిష్ట నారాయణ శాస్త్రి ఘనాపాటి, పర్యవేక్షణలో యాగనిర్వహణ జరగనున్నట్టు స్థానిక పట్టణ పురోహితులు కొత్తపెళ్లి లక్ష్మీ భరద్వాజ్ శర్మ వివరించారు.