👉24 గంటల ముందు బీఆర్ఎస్ కు షాక్..
J.SURENDER KUMAR,
పెద్దపల్లి పార్లమెంట్ పరిధి బీఆర్ఎస్ సమీక్ష సమావేశానికి 24 గంటల ముందు పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కీలక నేత కేసి వేణుగోపాల్ ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి వెళ్లారు.
ధర్మపురి నియోజకవర్గస్థాయి BRS కార్యకర్తల సమావేశము బుధవారం ధర్మపురి పట్టణంలోని లక్ష్మీ నరసింహ గార్డెన్ లో జరగనున్నది. ఈ సమావేశానికి రాష్ట్ర పరిశీలకులు మాజీ స్పీకర్ మధుసూదన చారి , జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంత , బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, యంపి బోర్లకుంట వెంకటేష్ నేత , హాజరుకానున్నట్టు మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ పేరిట ప్రకటన జారీ చేశారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెన్నూర్ లో పోటీ చేసి ఓడిన వెంకటేష్ నేతను, నాటి పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, టిఆర్ఎస్ లో చేర్పించారు. నాడు టిఆర్ఎస్ పార్టీలో డాక్టర్ వివేక్ వెంకటస్వామి కి ఆ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ కేసీఆర్ ఖరారు చేస్తున్న సమయంలో.. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలు, వివేక్ కు టిఆర్ఎస్ ఎంపీ టిక్కెట్టు రాకుండా చేసి, ఆ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ నేతను పోటీ చేయించారు. నేపథ్యంలో నాడు డాక్టర్ వివేక్ వెంకటస్వామి, బీ ఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. (ప్రస్తుతం చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే) త్వరలో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో. సీట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధం చేసుకోవడం తో, పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్ లో టిఆర్ఎస్ శ్రేణులు ఉక్కిరి బిక్కిరి అవుతు తమ వంతు తాముగా రాజకీయ మనుగడ కోసం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుల కనుసనల్లో పడడానికి కష్టపడుతూ కసరత్తు చేస్తున్నారు.