👉సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత చేరికతో టిక్కెట్ కోసం చెడుగుడు.
J.SURENDER KUMAR,
పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ టికెట్టు హాట్ కేక్ గా, గెలుపు కళ్ళముందే కనబడడం తో పార్టీ టికెట్ కోసం లొల్లి మొదలైంది. పెద్దపల్లి పార్లమెంట్ సెట్టింగ్ ఎంపి (బీఆర్ఎస్) వెంకటేష్ నేత మంగళవారం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి తో ఒకే కారులో కలిసి వెళ్లి కాంగ్రెస్ పార్టీ కీలక నేత కేసి వేణుగోపాల్ సమక్షంలో పార్టీలో చేరడంతో టిక్కెట్టు కోసం ఆశావాహులు చెడుగుడు ఆట మొదలైంది.
రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలలో పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్ లో, ధర్మపురి, పెద్దపల్లి, రామగుండం, మంథని, చెన్నూర్, మంచిర్యాల్, బెల్లంపల్లి అసెంబ్లీ సీట్లను కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్లీప్ చేసి విజయకేతనం ఎగురవేసింది. ఇక్కడ గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు కేవలం మెజార్టీ ఓట్ల సంఖ్యనే దాదాపు 3 లక్షల 50 వేలకు పై ఉన్నాయి. దీంతో ఈ పార్లమెంటుకు ఎనలేని డిమాండ్ .
దీనికి తోడు కోల్ బెల్ట్ ప్రాంతము, ఇటీవల జరిగిన సింగరేణి కార్మిక సంఘ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం గెలిచిన విషయం తెలిసిందే. చెన్నూర్ ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి కుమారుడు, వికాస్ ఇండస్ట్రీస్ ఎండి గడ్డం వంశీకృష్ణ, సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత, మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్, మాజీ ఎంపీ డాక్టర్ సుగుణ కుమారి, ప్రముఖ రియాల్టర్, సినీనిర్మాత, మైత్రి రిసార్ట్స్ అధినేత ఆసంపల్లి శ్రీనివాస్, ఆసంపల్లి శ్రీనివాస్ , గోమాస శ్రీనివాస్ , ఊట్ల వరప్రసాద్ , పెరుక శ్యామ్ ,బూడిద మల్లేశం తదితరులు టిక్కెట్ కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా పార్లమెంట్ పరిధిలో నీ ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులు సాధించిన మెజార్టీ ఓట్లు పార్లమెంట్ కు పోటీ చేస్తున్న ఆ పార్టీ అభ్యర్థులకు పడతాయనే గ్యారెంటీ కూడా ఉండకపోవచ్చునే ఉదంతాలు ఉన్నాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తారుమారు అయినా విషయం జగమెరిగిన సత్యం.
నిజాంబాద్ పార్లమెంట్ పరిధిలో జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్లలో బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు భారీ ఓట్ల మెజార్టీ వచ్చింది. ఒక్క జగిత్యాలో నే 60 వేల ఓట్ల మెజార్టీ రావడంతో నాటి బి ఆర్ ఎస్ అభ్యర్థి ప్రస్తుతం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గెలుపు నల్లేరు పై నడక అని పార్టీ అగ్రనాయకత్వం తో పాటు రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు.
అయితే జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్లలో బిజెపి పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కు మెజార్టీ ఓట్లు రావడం ప్రత్యేకత. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపులో మెజార్టీ ఓట్లు పొందిన అసెంబ్లీ సెగ్మెంట్ ఎమ్మెల్యేలకు, ఇన్చార్జిలకు మంత్రివర్గంలో చోటు, క్యాబినెట్ ర్యాంక్, ప్రోటోకాల్ హోదా నామినేటెడ్ పదవులు కల్పించే టాస్క్ ను కాంగ్రెస్ అధిష్టానం నిర్దేశించినట్టు సమాచారం.