👉జగిత్యాల ఎస్పీ సన్ ప్రీత్ సింగ్..
👉క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించిన ఎస్పీ
👉 విజేతగా నిలిచిన పోలీస్ టీమ్
J.SURENDER KUMAR,
ప్రెస్, పోలీసుల మధ్య మంచి కోఆర్డినేషన్ ఉండడానికి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించాము అని ప్రతి సంవత్సరం ఒక సారి ఈ విధంగా క్రికెట్ మ్యాచ్ నిర్వహణ ద్వారా ప్రతి ఒక్కరికీ ఆటవిడుపు తో పాటు మంచి టీమ్ స్పిరిట్ వస్తుందని జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అభిప్రాయపడ్డారు.
క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుందని నిత్యం బిజీగా ఉండే పోలీసులు, జర్నలిస్టులు కొంత సేపు ఆహ్లాదకరంగా గడిపారు అని ఎస్పి అన్నారు.

ఆదివారం స్థానిక గీత విద్యాలయం మైదానంలో పోలీస్ వర్సెస్ ప్రెస్ మధ్య నిర్వహించిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. మొదటగా ఎస్పీ టాస్ వేశారు. టాస్ గెలిచిన జిల్లా పోలీసు జట్టు మొదటగా బ్యాటింగ్ చేపట్టారు. ఎస్పీ బ్యాటింగ్ చేసి పోటీలను ప్రారంభించారు.

మొదట బ్యాటింగ్ చేసిన పోలీసు జట్టు నిర్ణీత 12 ఓవర్లకు 5 వికెట్స్ కోల్పోయి 133 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ప్రెస్ జట్టు నిర్ణీత 12 ఓవర్లలో 9 వికెట్స్ ను కోల్పోయి 83 లో పరుగులు చేయడం తో పోలీస్ జట్టు 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. అనంతరం విజేతలకు ఎస్పీ బహుమతులు అందించారు. ఈ క్రికెట్ మ్యాచ్ లో బెస్ట్ అల్ రౌండర్ గా పోలీస్ జట్టు నుండి కోరుట్ల సీఐ ప్రవీణ్ కుమార్ కు, అందించారు. బెస్ట్ బ్యాట్స్ మెన్ గా పోలీస్ టీం నుండి వెంకటేష్ (32 పరుగులు), బెస్ట్ బౌలర్ గా పోలీస్ టీం నుండి ఇన్స్పెక్టర్ నటేష్ (3 వికెట్స్ ), బెస్ట్ ఫీల్డర్ గా ప్రెస్ టీమ్ నుండి లక్ష్మణ్ కు అందించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు ప్రభాకరరావు, భీమ్ రావు, డీఎస్పీలు వేంకట స్వామి , రవీంద్ర కుమార్, జగిత్యాల జిల్లా యూనియన్ అధ్యక్షులు చిట్టి శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్, పట్టణ ప్రెస్ క్లబ్ కార్యదర్శి మల్లారెడ్డి, పాత్రికేయులు సూర్యం, మహేష్, ఆదిల్ , మధు, SB ఇన్స్పెక్టర్ నాగేశ్వర రావు, సి.ఐ లు నటేశ్, ప్రవీణ్ కుమార్ , లక్ష్మీనారాయణ, ఆరిఫ్ అలీ ఖాన్, RI జానీ మియా ,రామకృష్ణ, వేణు, మరియు ఎస్.ఐ లు, పాత్రికేయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
