సిట్టింగ్ ఎంపీ సీఎం వెంట.. టికెట్ ఎవరికో ? అనే తంట !

👉 17 పార్లమెంట్ ఎంపీ టికెట్ల కోసం 309 మంది దరఖాస్తులు..

👉 PEC కి మూడు పేర్లు …

J.SURENDER KUMAR,

పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ టికెట్ కోసం అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ కి చెందిన పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత మంగళవారం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి వెంట వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధినేతల తో ఆ పార్టీ చేరడం, కండువా కప్పుకోవడం తో పెద్దపల్లి టికెట్టు ఎవరికో ? అనే తంటా ఆశావాహులో మొదలైంది.

17 పార్లమెంట్ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న 309 మంది అభ్యర్థుల వివరాలను రెండు భాషలలో ముద్రించిన పుస్తకాలను పార్టీ స్క్రీనింగ్ కమిటీకి అందజేస్తూ ఒక్కో పార్లమెంటు స్థానంకు మూడు పేర్లును పంపాలి అనే నిబంధనను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దీపాదాస్‌ మున్షీ ఆదేశించినట్టు తెలిసింది.

పెద్దపల్లి టికెట్ కోసం, వికాస్ ఇండస్ట్రీస్ ఎండి గడ్డం వంశీకృష్ణ, సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత, మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్, మాజీ ఎంపీ డాక్టర్ సుగుణ కుమారి, ప్రముఖ రియాల్టర్, మైత్రి రిసార్ట్స్ అధినేత ఆసంపల్లి శ్రీనివాస్, గోమాస శ్రీనివాస్ , ఊట్ల వరప్రసాద్ , పెరుక శ్యామ్ , బూడిద మల్లేశం దరఖాస్తు చేసుకున్నారు.


👉ఎంపీ వెంకటేష్ నేతకు.. ఇచ్చిన హామీ ఏమిటి ?

పెద్దపల్లి సిట్టింగ్ ఎంపి వెంకటేష్ నేత కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీ ఏమిటి ? ఏ హామీ, నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చి చడి చప్పుడు లేకుండా ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి ఆ పార్టీ అధినేత కేసి వేణుగోపాల్ సమక్షంలో పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గ్ ను కలవడంతో టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఆశావాదులలో ఆందోళన మొదలైనట్టు చర్చ.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ హరీశ్‌ చౌదరి, సభ్యులు జిగ్నేశ్‌ మేవాని, విశ్వజిత్ బుధ గురు , వారాలలో ఇక్కడే ఉండి అభ్యర్థుల ఎంపికపై నేతల అభిప్రాయాలను రికార్డు చేస్తారు.

👉ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ కు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారా ?

అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దిరోజుల ముందు బిజెపి పార్టీలో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా కొనసాగుతున్న డాక్టర్ వివేక్ వెంకటస్వామి అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కు కొన్ని రోజుల ముందు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్లమెంట్ ఎన్నికల్లో తన కుమారుడు విశాఖ ఇండస్ట్రీస్ ఎండి వంశీకృష్ణ కు పెద్దపల్లి ఎంపీ టికెట్ అంశం లో రాహుల్ గాంధీతో ఒప్పందం జరిగినట్టు చర్చ.

👉బీఆర్ఎస్ నుంచి..

బీఆర్ఎస్ నుంచి చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇద్దరిలో ఒక్కరిని ఆ పార్టీ ఎంపీ టికెట్టు ఇవ్వనున్నట్టు చర్చ. పెద్దపల్లి మాజీ ఎంపీగా, కేసీఆర్, కేటీఆర్, కల్వకుంట్ల కవితకు నమ్మిన బంటుగా ప్రచారంలో ఉన్న బల్క సుమన్ , సింగరేణి కార్మికునిగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అనుభవంతో పాటు ఓటమి చెందిన సానుభూతి తో కొప్పుల ఈశ్వర్ ఓవైపు, మరోవైపు తమ కుటుంబ సభ్యులలో ఒకడిగా. ఉంటున్న బాల్క సుమన్ కు పెద్దపల్లి టికెట్టు కట్టబెట్టడమా ? అనే తర్జన భర్జన బీఆర్ఎస్ అధిష్టానం ( కెసిఆర్, కేటీఆర్ ) పడుతూ ఎటు తేల్చుకోలేని దుస్థితిలో ఉన్నట్టు చర్చ.

👉వీరిదే ప్రధాన పాత్ర ఉంటుంది !

పెద్దపల్లి పార్లమెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపులో ప్రధానంగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, నిర్ణయమే కీలకంగా కానున్నది. పెద్దపెల్లి ఎమ్మెల్యే, విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే, రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ల పాత్ర ప్రదానం కానున్నాయి.


👉పార్టీ క్యాడర్ ను కాపాడుకున్నారు..


మంత్రి శ్రీధర్ బాబు 2014 ఎన్నికల్లో ఒకేసారి మంథని సెగ్మెంట్లో ఓటమి పొందారు. ఓడిన, గెలిచిన తన నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, నాలుగు సార్లు ఓటమి చెందిన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, పార్టీ క్యాడర్ ను కాపాడుకుంటూ ప్రజా సమస్యలపై, సిట్టింగ్ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై రాజీలేని పోరాటం చేస్తూ 22 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల్ ఎమ్మెల్యేలు 2014, 2018, ఎన్నికల్లో ఓటమి చెందిన ప్రజాక్షేత్రంలో ఉంటూ తమ పార్టీ క్యాడర్ ను కాపాడుకుంటూ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తూ ఎన్నికల్లో వారి ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలంతో పాటు, వ్యక్తిగతంగా వీరికి బలమైన ఓటు బ్యాంకు ఉందనే విషయం జగమెరిగిన సత్యం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికి టిక్కెట్టు ఇవ్వాలన్న వీరి అభిప్రాయాలు కీలకం.. దీంతోపాటు ఎంపీ ఎన్నికలలో ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీకి వచ్చే మెజార్టీ ఓట్లే ఎమ్మెల్యేల రాజకీయ పదోన్నతులకు టాస్క్ అనే చర్చ మొదలైంది.