శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో ఉచిత అన్నదాన పథకం ప్రారంభం!

👉ప్రారంభించిన టిటిడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి !

J.SURENDER KUMAR,


శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో భక్తులకు నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్  భూమన కరుణాకరరెడ్డి, ఈవో  ఏవీ ధర్మారెడ్డి గురువారం శ్రీ పెద్ద జీయర్, శ్రీ చిన్న జీయర్ స్వామీజీల సమక్షంలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ యాత్రికుల నగరానికి వచ్చే భక్తులందరికీ ప్రయోజనం చేకూరేలా అన్నప్రసాద కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా నిర్వహించేందుకు టీటీడీ సిద్ధంగా ఉందన్నారు. శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో ఉత్తర మాడ వీధిలో ఉన్న శ్రీ నమ్మాళ్వార్ సన్నిధిలో ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సుమారు 2000 మంది భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

గురువారం తిరుమలతో పాటు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో, ప్రస్తుతం శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో కూడా పదివేల మంది భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేస్తున్నారు. త్వరలో వంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం.

శ్రీ గోవిందరాజ స్వామి ఆలయానికి అన్నప్రసాదం కోసం వెళ్లిన తన చిన్ననాటి రోజులను గుర్తుచేసుకున్న ఆయన ఈరోజు టీటీడీ చైర్మన్‌గా ఇలాంటి ధార్మిక కార్యక్రమాన్ని చేపట్టడం గర్వకారణమన్నారు. జేఈవో  వీరబ్రహ్మం, ఎఫ్ఏసీఏవో  బాలాజీ, సీఈ  నాగేశ్వరరావు, సీపీఆర్వో డాక్టర్ టి రవి, డీఈవోలు రాజేంద్ర, శ్రీమతి శాంతి, వీజీవో  బాలిరెడ్డి, క్యాటరింగ్ స్పెషల్ ఆఫీసర్  శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.