త్వరలో జగిత్యాల  మున్సిపల్ ఛైర్పర్సన్, ఎంపీపీ పదవుల భర్తీ !

👉చట్టాన్ని సాకుగా చూపి ఖాళీ అయిన స్థానాలు భర్తీ చేయకుండా మహిళల పై వివక్ష..

👉బలహీన వర్గాల హక్కుల రక్షణలో బీఆర్ఎస్ పార్టీ విఫలం

.👉సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, స్థానిక సంస్థల చట్టంలో మార్పులు..

👉ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి..

J.SURENDER KUMAR,

జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్,  జగిత్యాల మండల పరిషత్ అధ్యక్ష పదవులను త్వరలో భర్తీ చేయనున్నట్టు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, స్థానిక సంస్థల చట్టంలో మార్పులు చేసి పదవుల భర్తీకి కృషి చేస్తానన్నారు.
జగిత్యాల లోని ఇందిరా భవన్ లో  మంగళవారం  జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ..

👉జగిత్యాల మండల పరిషత్ ఛైర్పర్సన్ మరణంతో  అధ్యక్ష పదవి ఖాళీ ఏర్పడింది., జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ రాజీనామా చేయడం తో ఖాళీ ఏర్పడింది అన్నారు.

👉స్థానిక సంస్థల్లో సామాజికంగా  మహిళలకు ప్రాధాన్యత కల్పించాలని స్వర్గీయ రాజీవ్ గాంధీ 73,74 రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థల్లో  మూడో వంతు స్థానాలు రిజర్వేషన్ కల్పించారు.

👉సాధారణంగా ఏ పోస్టు ఖాళీ అయితే అదే వర్గానికి చెందిన వారిని ఆరు నెలల్లో  నియమించాలి.

👉జగిత్యాల మండల పరిషత్ ఛైర్పర్సన్ మరణంతో  అధ్యక్ష పదవి ఖాళీ ఏర్పడింది., జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ రాజీనామా చేయడం తో ఖాళీ ఏర్పడింది..

👉మండల పరిషత్ అధ్యక్ష పదవిలో  భర్తీ చేయకపోవడంతో మూడు సంవత్సరాలు, మున్సిపల్ చైర్ పర్సన్ పదవిలో ఏడాది కాలంగా అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు పదవుల్లో కొనసాగుతున్నారు.

👉ఖాళీ అయిన స్థానాలు భర్తీ చేయక పోవడంతో మహిళలకు కేటాయించిన రిజర్వేషన్, హక్కులు కోల్పోతున్నారు.

👉ఖాళీ అయిన స్తానాన్ని భర్తీ చేయకపోవడం మహిళల పై వివక్ష చూపడమేనని అన్నారు.

👉స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కెసిఆర్,కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు చట్టంలో మార్పు  చేయించి, మున్సిపల్ ఛైర్పర్సన్, మండల పరిషత్ లో అధ్యక్ష స్థానం ఎందుకు భర్తీ చేయలేదు అన్నారు.

👉ఖాళీలు భర్తీ  చేయటానికి ఎటువంటి చర్యలు చేపట్టలేదు.స్థానిక సంస్థల చట్టానికి మార్పులు చేయలేదు.

👉.బలహీన వర్గాలకు కేటాయించిన స్థానంలో ఉన్నత వర్గానికి చెందిన వారు కొనసాగుతుండడంతో బలహీన వర్గాలు రిజర్వేషన్స్, హక్కులు కోల్పోతున్నారు.

👉బలహీన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల రక్షణ స్థానిక ప్రజా ప్రతినిధుల బాధ్యత.

👉జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ , జగిత్యాల రూరల్ మండల పరిషత్ లో బీఆర్ ఎస్ ఆధిక్యం ఉండి కూడా బలహీన వర్గాలకు కేటాయించిన స్థానం భర్తీ చేయాలనే ఆలోచన ఎమ్మేల్యేకు లేదా ?

👉సామాజిక వెనకబాటుతనాన్ని ఆధారంగా ఏర్పాటు చేసిన రిజర్వేషన్లలో ఉన్నత వర్గం అధికారం అనుభవిస్తుంటే  ఇన్నాళ్లు ఎం చేశారు. ఎందుకు భర్తీ చేయలేదు.

👉వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెడితే, వైస్ ఛైర్మన్ ఎలా కాపాడాలని ఎమ్మెల్యే ఆలోచించారే తప్ప బలహీన వర్గాల హక్కుల రక్షణ కోసం చొరవ చూపి, ఖాళీ అయిన స్థానాలు భర్తీ  చేసేందుకు చొరవ తీసుకొలేదన్నారు.

👉జ్యోతి బాపులే విగ్రహం పెట్టాలని చెబుతున్న వారు మహిళలకు కేటాయించిన హక్కులు కల్పించడంలో ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించారు.

👉ఇదే నా మీ జ్యోతి బాపులే స్ఫూర్తి అని బీ ఆర్ ఎస్ నాయకులను  నిలదీశారు..

👉గత ప్రభుత్వం బలహీన వర్గాల అభివృద్ధి కోసం చట్టసభలకు ఎంపికైన వారితో రెండు రోజులు మేదోమథనం జరిపి, నివేదిక ఇచ్చినా అమలు చేయలేదని ద్వజమెత్తారు.

👉నాలుగేళ్లు స్వయం ఉపాధి పథకం అమలు చేయని రాష్ట్రం దేశంలో  తెలంగాణ ఒక్కటే అన్నారు.

👉ఎన్నికల ముందు ప్రజలను మభ్య పెట్టేందుకు రు.1 లక్ష పథకం తెర పైకి తెచ్చారని దుయ్యబట్టారు.

👉రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కుల గణన చేపట్టి, బలహీన వర్గాల ప్రజల హక్కుల రక్షణ కోసం రిజర్వేషన్లు పునః సమీక్షించి, 25%నుండి40% పెంచేందుకు కృషి చేస్తున్నాం

👉చైర్ పర్సన్, మండల పరిషత్ అధ్యక్ష పదవి భర్తీ చేయకుండ అడ్డుగా ఉన్న నిబందలను మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెల్లగానే, మార్పులు. చేయాలని
అధికారులను ఆదేించి మార్పు చేశారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

👉ప్రజాస్వామ్య ప్రక్రియని నిలబెట్టేందుకు తాను కృషి చేస్తున్నానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

👉త్వరలో మున్సిపల్ చైర్ పర్సన్ పదవితో పాటు, మండల పరిషత్ అధ్యక్ష పదవి కి ఎన్నికలు జరుగనున్నాయి.

👉తాడిత, పీడిత వర్గాల అభ్యున్నతి కోసం ప్రజాప్రతినిధులు అందరూ పాటుపడాలన్నారు.

👉బలహీన వర్గాల ప్రజల హక్కుల రక్షణ కోసం అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.