తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,

ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ బుధవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నీ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు.


ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ తిరుమలలో మాట్లాడుతూ…


తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామీ వారిని శాసన సభ్యులుగా, ప్రభుత్వ విప్ గా ఎన్నికైన తర్వాత మొదటి సారి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, భగవంతుని ఆశీర్వాదం వల్ల ఇటీవల తనకు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నుండి క్షేమంగా బయటపడ్డాను అన్నారు. ఆ ఏడుకొండల స్వామి వారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా ధర్మపురి నియోజక వర్గ ప్రజలకు ఏళ్ల వేళల ఉండాలని, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా స్వామి వారిని కోరుకున్నట్లు, మీడియాకు వివరించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ పేద ప్రజలకు ఇచ్చిన ఎటువంటి హామీని నిలబెట్టుకోలేదని, రానున్న ఎంపి ఎన్నికల్లో కూడా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండి అన్ని ఎంపీ స్థానాలు గెలిపిస్తారని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.