👉దాత దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్…
J.SURENDER KUMAR,
తిరుపతిలోని ఎస్‌వి గోశాలలో టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఇఓ ఎవి ధర్మారెడ్డి సమక్షంలో ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే ఎం వేణుగోపాల్ శనివారం 25 గిర్-సాహివాల్ జాతి దేశీ ఆవులను విరాళంగా అందించారు.

ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో నిత్య కైంకర్యాల కోసం రోజుకు 30 కిలోల నెయ్యి అవసరాలు తీర్చేందుకు టీటీడీకి ప్రస్తుతం ఉన్న దేశీ గోవులకు అదనంగా 500 దేశీ ఆవులు అవసరమన్నారు.

అనంతరం విరాళంగా అందజేసిన దేశీ ఆవులకు చైర్మన్, ఇఓ ప్రత్యేక పూజలు నిర్వహించి పశుగ్రాసాన్ని తినిపించారు. అనంతరం దాత దంపతులకు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఎస్వీ గోశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.