ఎన్నికలకు ముందు తెలుగు రాష్ట్రాలలో మొదలైన పోస్టర్ వార్ !

👉ఏపీలో మూడు పార్టీలు..

👉తెలంగాణలో రెండు పార్టీలు..

J.SURENDER KUMAR,

త్వరలో జరగనున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలలో ఆంధ్ర , తెలంగాణ రాష్ట్రాలలో పోస్టర్ వార్ సంస్కృతి మొదలైంది. ఏపీలో వైఎస్ఆర్, జనసేన పార్టీల మధ్య మొదలైన పోస్టర్ వార్ తెలంగాణలో కాంగ్రెస్, బిజెపి పార్టీల మధ్య మొదలైంది.
వివరాల్లోకి వెళ్తే..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విశాఖ జిల్లా భీమిలిలో ‘సిద్ధం ‘ ( సిద్ధం ) అంటూ ఎన్నికల శంఖారావం పూరించారు.  మరుసటి రోజున  ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, జనసేన పార్టీలు సిద్ధం’కు కౌంటర్ ఇస్తూ తమ పోస్టర్‌లను విడుదల చేశాయి. విజయవాడ నగరంలోని కృష్ణలంక వద్ద జాతీయ రహదారికి ఆనుకుని సీఎం జగన్‌ ఫొటోతో వైఎస్సార్‌సీపీ ‘సిద్ధం’ పోస్టర్‌ను ఏర్పాటు చేసింది. 

దీనికి కౌంటర్ గా జనసేనాని సిద్దం పోస్టర్ పక్కనే పవన్ కళ్యాణ్ ఫోటోతో కూడిన ‘మేము సిద్ధమే’  అనే పోస్టర్‌ను ఏర్పాటు చేశారు. విజయవాడ నగరం అంతటా ఇలాంటి పోస్టర్లు వెలిశాయి.

ఆంధ్రప్రదేశ్ లో మరో రాజకీయ పార్టీ ‘జై భారత్ నేషనల్ పార్టీ ‘  ‘పగల కోసం వారు-ప్రజల కోసం మేము సిద్ధం’  (ప్రజల కోసం మేము సిద్ధం) అనే నినాదంతో పాటు పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ ఫోటోతో కూడిన పోస్టర్‌ను విడుదల చేశారు.


తెలంగాణలో..


సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీమంత్రి పట్టబద్రుల ఎమ్మెల్సీ  టీ జీవన్ రెడ్డి, ఫోటోతో ఆ పార్టీ శ్రేణులు ‘ సిద్ధం’  అంటూ జగిత్యాల్ పట్టణంలో పోస్టర్లు ఏర్పాటు చేశారు. దీనికి కౌంటర్ గా బిజెపి పార్టీ శ్రేణులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ ఫోటోతో పాటు ప్రధాని మోడీ ఫోటోతో జై శ్రీరామ్ నినాదంతో  ‘ మేము సిద్ధం ‘ అంటూ పట్టణం లో పోస్టర్లు వేశారు.
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నాటికి ఈ పోస్టర్ వార్ సంస్కృతి  వివిధ రాజకీయ పార్టీలు శ్రీకారం చుట్టాలు ఉన్నాయో లేదో ? తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు వ్యాపిస్తుందో  లేదో  ? వేచి చూడాల్సిందే