అజాత శత్రువు శ్రీపాదరావు జయంతి అధికారిక ఉత్సవాలు నేడు..

👉ఉమ్మడి రాష్ట్రంలో పుష్కర నిధులు సాధించిన సాధన సూర్యుడు!

👉శాసనసభాపతి అయినా.. సామాన్యుడిలా..

👉నేడు శ్రీపాద రావు  87వ జయంతి

👉 సాయంత్రం 5 గంటలకు ప్రభుత్వం అధికారికంగా రవీంద్ర భారతిలో జయంతి ఉత్సవాలు..


J.SURENDER KUMAR,

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్ధిల్ల శ్రీపాదరావు 87 జయంతి అధికారి క ఉత్సవాలు నేడు ( శనివారం) రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్నది.  శ్రీపాదరావు జయంతిని మార్చి 2 న స్టేట్ ఫంక్షన్ గా నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీవో నెంబర్ 295 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. నేటి సాయంత్రం 5 గంటలకు ప్రభుత్వం అధికారికంగా రవీంద్ర భారతిలో నిర్వహించనున్న జయంతి ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.


👉ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు మొదటిసారి పుష్కర నిధులు సాధించిన సాధన సూర్యుడు!


శ్రీపాదరావు రాజకీయ ప్రస్థానంలో అపాదా మస్తకం. తన నియోజకవర్గంతో పాటు తెలంగాణ ప్రాంతం అభివృద్ధి పట్ల ఆరాటపడే తత్వం, అత్యున్నత పదవిలో ఉన్న, తన ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారు. ఈ నేపథ్యంలో ఓ సందర్భం..

👉 గోదావరి నది పుష్కరాలు అంటే

ఆంధ్ర ప్రాంతం రాజమండ్రి లోనే కాదు, మా తెలంగాణలో గోదావరి నది ప్రవహిస్తుంది. ఇక్కడ గోదావరి నదికి పుష్కరాలు జరుగుతాయి. ఆ పుష్కరాలను  (పర్వాని) అంటారు. బాసర, ధర్మపురి, మంథని ,కాలేశ్వరం పుణ్యక్షేత్రాల గుండా గోదావరి నది ప్రవహిస్తుందని  శాసన సభాపతి హోదాలో అప్పటి  ముఖ్యమంత్రిని డిమాండ్ చేసి 1991 పుష్కర నిధులను  తెలంగాణకు కేటాయించాల్సిందే అని నాటి ధర్మపురి (బుగ్గారం) ఎమ్మెల్యే స్వర్గీయ మాజీమంత్రి జువ్వడి రత్నాకర్ రావు తో కలిసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి మొదటిసారి తెలంగాణ ప్రాంతానికి పుష్కర నిధులు సాధించిన, సాధన సూర్యుడు శ్రీపాదరావు.
ఆ నిధులతో ధర్మపురి, మంథని ,కాలేశ్వరంలో సిమెంట్ రోడ్లు, భక్తుల సౌకర్యార్థం తడుకల పందిళ్లు, ఆలయాలకు రంగులు వేయించారు.


👉పుష్కర స్నానాలు ఇక్కడే..

పుష్కరాల్లో రాజమండ్రి గోదావరిలో పుష్కర స్నానం చేయకుండా, ధర్మపురి కాలేశ్వరం మంథని నది తీరాల్లో తమతోపాటు పలువురు ప్రముఖులను పుష్కర స్నానాలు చేయాల్సిందిగా తెలంగాణ ప్రాంతానికి ఆహ్వానించారు. పుణ్యక్షేత్రాల విశిష్టత ను వారికి వివరించారు.

👉సామాన్య భక్తుడిలా...


12 రోజులపాటు తన వెన్నంటి సెక్యూరిటీ ( అంగరక్షకులు) లేకుండా ఈ నది తీర ప్రాంతంలో జరిగిన ధార్మిక కార్యక్రమాల్లో శ్రీపాద రావు భక్తజనంతో కలసి సామాన్య భక్తుడిలా పాల్గొన్నారు. పుష్కర నిధులతో చేపట్టిన పనులను నాటి ఎమ్మెల్యే స్వర్గీయ మాజీ మంత్రి జువ్వడి రత్నాకర్ రావు తో కలిసి ప్రారంభించారు.

👉రాజకీయ నేపథ్యం...

భూపాల్ పల్లి జిల్లా కాటారం మండలం దన్వాడ గ్రామంలో 1935 మర్చి 2 న మౌళి పటేల్ రాధాకృష్ణయ్య కమల భాయ్ దంపతులకు శ్రీపాదరావు జన్మించారు. నాగపూర్ లో న్యాయ విద్యనభ్యసించారు. తెలుగుదేశం పార్టీ ప్రభంజనం లో 1983 నుంచి వరుసగా మూడుసార్లు మంథని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దట్టమైన కి కారణ్యం , పీపుల్స్ వార్ నక్సల్స్ ప్రాబల్యం గల. మంథని నియోజకవర్గంలో. సాగు, తాగు నీటి సమస్యలతో పాటు విద్యా, వైద్య సదుపాయలు, రహదారుల అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పన కోసం పట్టు పురుగుల పెంపక కేంద్రం తదితర అభివృద్ధి పనులు నక్సల్స్ ప్రాంతంలో చేపట్టిన ఘనత శ్రీపాదరావు ది.
👉రెండుసార్లు ధన్వాడ సర్పంచ్ గా.

. మహాదేవపూర్ సమితి బ్లాక్ ఉపాధ్యక్షుడిగా, ఎల్ఎంబి చైర్మన్ గా నిరంతరం ప్రజాక్షేత్రంలో మమైకమైన 1983 లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలోనూ తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. భారతరత్న స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి. పీవీ నరసింహారావు తో కుటుంబ పరంగా రాజకీయంగా స్నేహ సంబంధాలు ఉన్నాయి ఆధునిక వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటు పట్ల ఈ ప్రాంత రైతాంగాన్ని చైతన్య పరచడం కోసం శ్రీపాదనలేని కృషి చేశారు. ఈ నియోజకవర్గ ప్రజలు శ్రీపాదరావు ను ‘ బుచ్చి పంతులు’ అని ప్రేమగా పిలుస్తారు.. రాజకీయ పరంగా శ్రీపాదరావును వ్యతిరేకించే వారిని సైతం ఆయన పలకరించేవారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కనీసం పదిమందిని పేరుపేరునా పిలిచే సంబంధాలు కలిగి ఉన్న శ్రీపాదరావు. అజాతశత్రువుగా గుర్తింపు పొందారు. మహాదేవపూర్ మండలం అటవీ గ్రామమైన అన్నారంలో ఓ కాంగ్రెస్ కార్యకర్త ఇంట్లో ఓ కార్యక్రమనికి 1999 ఏప్రిల్ 13న శ్రీపాదరావు అడవి మార్గం గుండా వెళ్లారు. ఆ దారిలో వార్ నక్సలైట్లు శ్రీపాదరావు ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. ‘మా సమస్యల గురించి మీతో మాట్లాడాలి’ మాతో మీరు ఒంటరిగా రావాలని శ్రీపాదరావు నక్సలైట్లు కోరారు.ఆయన వెంట ఉన్న అనుచరులను మీరు రావద్దని ఆదేశించారు. అనేక సందర్భాల్లో పలువురు వార్ సానుభూతిపరుల ను, మిలిటెంట్లను పోలీస్ స్టేషన్, కేసుల నుంచి, శ్రీపాదరావు విడిపించారు. ఈ నేపథ్యంలో సార్ తో నక్సల్స్ మాట్లాడుతారని అనుచరులు అక్కడ ఆగిపోయారు. కొన్ని గంటల వ్యవధిలోని శ్రీపాదరావు ను హతమార్చిన సమాచారం బయటికి ప్రపంచానికి తెలిసింది. అప్పటి కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సీఎం చంద్రబాబు నాయుడు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి శ్రీపాదరావు శ్రద్ధాంజలి ఘటించారు. శ్రీపాదరావు ఉన్నంతకాలం ఆయన కుటుంబ సభ్యులు కుమారులు రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. 1991,. ఆగస్టు నుంచి, జనవరి 1995 , వరకు ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్ గా శ్రీపాదరావు కొనసాగారు. శ్రీ దత్తాత్రేయ స్వామి ఆయన ఇష్ట దైవం, ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఇంటి ఇలవేల్పు,


సాయంత్రం ఐదు గంటలకు రవీంద్రభారతిలో.. స్వర్గీయ స్పీకర్ శ్రీపాదరావు జయంతి ఉత్సవాలు.


ముఖ్య అతిథి
రేవంత్ రెడ్డి - తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు


జ్యోతి ప్రజ్వలనం
జి కిషన్ రెడ్డి  - కేంద్ర మంత్రివర్యులు


సభాధ్యక్షులు
జూపల్లి కృష్ణారావు  - ఎక్సైజ్, పర్యాటక సాంస్కృతిక మరియు పురావస్తు శాఖమాత్యులు


విశిష్ట అతిధులు
పొన్నం ప్రభాకర్  - బీసీ సంక్షేమం & రవాణా శాఖ మాత్యులు


వేం నరేందర్ రెడ్డి  - ముఖ్యమంత్రి  సలహాదారు
గౌరవ అతిథులు


శ్రీమతి గద్వాల విజయలక్ష్మి - మేయర్ జిహెచ్ఎంసి


జీవన్ రెడ్డి  - తెలంగాణ శాసనమండలి సభ్యులు


శ్రీ ఎం.ఎస్ ప్రభాకర్ రావు  - తెలంగాణ శాసన మండలి సభ్యులు


దానం నాగేందర్  - శాసనసభ సభ్యులు ఖైరతాబాద్


శ్రీమతి పి.విజయా రెడ్డి  - కార్పొరేటర్ ఖైరతాబాద్


మీ
దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ పరిశ్రమలు మరియు వాణిజ్యం మరియు శాసనసభ వ్యవహారాల శాఖమత్యులు