👉ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
👉మహిళలకు రైల్వేల్లో ఉచిత ప్రయాణం కల్పించాలి
👉రాహుల్ గాంధీ దృష్టికి తీసికెళ్తా
👉ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
J.SURENDER KUMAR,
రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆర్ధిక భారం పడ్డా ప్రజా సంక్షేమం కోసం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్,అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.
జగిత్యాల లో కళ్యాణాలక్ష్మి, షాధిముభారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో శనివారం పాల్గొని మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని ఆర్థిక వ్యవస్థ లోటు ఉందని ఆర్థిక భారం అయినప్పటికీ ప్రజలకిచ్చిన వాగ్ధానాలను సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నూటికి నూరు శాతంకాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.
ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,200 యూనిట్లలోపు ,గృహ విద్యుత్ మాఫీ, 500 లకే సిలిండర్,10 లక్షలకు ఆరోగ్యశ్రీ పెంపు అమలు చేశామని,11 న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభిస్తామని చెప్పారు. రైతులకు మద్దతు ధర కల్పించి కల్లాల వద్ద ధాన్యం కొనుగోలు చేసి రైతుల కండ్లల్లో సంతోషాన్ని నింపుతామని లక్ష్మణ్ కుమార్ ప్రకటించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్ద పిటవేస్తూనే అన్ని వర్గాలను, అన్ని రంగాలను అభివృద్ధి పరుస్తామని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన డిసెంబర్ 7 తర్వాత పెళ్ళైన పేదింటి ఆడ బిడ్డకు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం పథకం వర్తిస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతమైందని దీనికోసం ప్రభుత్వం ఆర్టీసీకి 300 కోట్లు రీ పేమెంట్ చేసిందన్నారు.
200 యూనిట్ల లోపు వాడుకున్న గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ సౌకర్యం తెలంగాలో చేపట్టగా 90 శాతం ప్రజలకు ఉపయోగపడుతుందని, దేశంలో ఎక్కడా ఈ పథకం లేదని ₹500 లకే మహిళలకు సిలిండర్ అందిస్తున్నామని తెలిపారు.
దేశవ్యాప్తంగా రైల్వేల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి జీవన్ రెడ్డి సూచించారు.
రైల్వేల్లో జనరల్ బోగీల్లో ఈ సౌకర్యం వర్తింప చేస్తే బాగుంటుందని, కాంగ్రెస్ అగ్ర నేత రాహూల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తానని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. .
ఈ కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, కౌన్సిలర్లు, ఎంపిపి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.