బండి సంజయ్ టార్గెట్ గా ఫోన్ ట్యాపింగ్ మొదలైందా?

👉సంజయ్ అంశంలో సక్సెస్ ?


J.SURENDER KUMAR,

కరీంనగర్ ఎంపీ, బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి

సంజయ్ టార్గెట్ గా గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్

కు శ్రీకారం చుట్టిందా ? ఆ లక్ష్యం పూర్తికాగానే అదే పరంపరలో

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇతర ప్రతిపక్ష

నాయకుల ఫోన్ ట్యాపింగ్ కు శ్రీకారం చుట్టారా ? సంజయ్

ఫోన్ ట్యాపింగ్ తో నాటి బి ఆర్ ఎస్ ప్రభుత్వ లక్ష్యం

నెరవేరిందా ? అనే చర్చ మొదలైంది.

👉బండి సంజయ్ టార్గెట్ ఎందుకంటే ?

ఎదురులేని కెసిఆర్ రాజకీయ సామ్రాజ్యంలో బండి సంజయ్ బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడీ గా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి సంజయ్ రాజకీయ కార్యకలాపాలతో కెసిఆర్ కు ఆయన ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేశాడనేది జగమెరిగిన సత్యం. రాష్ట్రంలో గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి ఎరుగని కెసిఆర్ సామ్రాజ్యంలో దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు విజయం సాధించడం. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి నాలుగు స్థానాల నుంచి 48 కార్పొరేట్ స్థానాలు కైవసం చేసుకోవడం, మునుగోడు ఉప ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తో ఓటమి. దీనికి తోడు కెసిఆర్ భాషలోనే మాటకు మాట సంజయ్ సమాధానం, ప్రజా సంగ్రహమ పాదయాత్ర, తదితర అంశాల నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీలో ప్రకంపనాలు మొదలైనట్టు చర్చ. బండి సంజయ్ రాజకీయ కార్యకలాపాల పై నిఘా పెట్టి కౌంటర్ గా కట్టడి కోసం సంజయ్, ఆయన గాడ్ ఫాదర్ , అనుచరుల ఫోన్ ట్యాపింగ్ కు 2021 లో శ్రీకారం చుట్టినట్టు చర్చ
వరుసగా రెండవసారి కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల పాటు కెసిఆర్ మంత్రివర్గం ఏర్పాటు చేయకుండా పాలన కొనసాగించారు. ప్రతిపక్షలను, పాత్రికేయులను మాటల తూటాలతో తులనాడినా, 2020 మార్చి మాసం వరకు కెసిఆర్ ను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రశ్నించే సాహసం ఏ వ్యక్తులుగాని, వ్యవస్థలుగాని చేయలేదు.

👉 బండి సంజయ్ తో ప్రకంపనాలు ?

కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ నీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర నాయకత్వం 2020 మార్చి లో పార్టీ పగ్గాలు అప్పగించింది. సీఎం సొంత మెదక్ జిల్లాలో దుబ్బాక శాసనసభ్యుడు రామలింగారెడ్డి మృతితో జరిగిన ఉప ఎన్నికల్లో బండి సంజయ్ నాయకత్వంలో దుబ్బాక ఎమ్మెల్యేగా బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో సిద్దిపేట పోలీస్ కమిషనర్ కు బండి సంజయ్, బిజెపి క్యాడర్ కు మధ్య జరిగిన గొడవలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
👉హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు.

డిసెంబర్ 2020 లో హైదరాబాద్ నగర కార్పొరేషన్ ఎన్నికలు బండి సంజయ్ నాయకత్వంలో నువ్వా ? నేనా ? అనే తరహాలో జరిగాయి.
ఈ ఎన్నికల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బిజెపి 48 కార్పొరేట్ స్థానా లు గెలవడం టిఆర్ఎస్ 55. కార్పొరేట్ స్థానాలు MIM కు 44 స్థానాలు దక్కాయి.

👉బిజెపినాలుగు స్థానాల నుంచి…

2016 లో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ 99 మంది కార్పొరేటర్ లు విజయం సాధించగా MIM 44 మంది గెలిచారు. ఈ ఎన్నికలలో బిజెపి కేవలం 4 కార్పొరేట్ స్థానాలతో సరిపెట్టుకుంది. రెండు స్థానాలతో కాంగ్రెస్ సరిపెట్టుకుంది. రాష్ట్ర రాజధానిలో బిజెపికి ఓట్లు ,సీట్లు పెరగడంతో యువకులు, విద్యావేత్తలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు సంజయ్ నాయకత్వంలో బిజెపిలో చేరికలు మొదలయ్యాయి.

👉ఈటెల గెలుపు తో…

కెసిఆర్ ప్రభుత్వంలో నెంబర్ 2 గా కొనసాగిన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పై కెసిఆర్ ప్రభుత్వం భూకబ్జా, తదితర ఆరోపణలు చేయడంతో మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవితో పాటు టిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. హుజురాబాద్ అసెంబ్లీకి 2021 నవంబర్ జరిగిన ఉప ఎన్నికల్లో రాజేందర్ బిజెపి అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల్లో రాజేందర్ ఓటమికి కెసిఆర్ ప్రభుత్వ యంత్రాంగం యావత్తు హుజురాబాద్ లో మాఖం వేసింది. ఈ ఎన్నికల్లోను బండి సంజయ్, బిజెపి క్యాడర్ కలిసికట్టుగా కెసిఆర్ రాజకీయ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ రాజేందర్ గెలుపుకు పక్క రాజకీయ ప్రణాళిక తో విజయం సాధించారు. దీంతోపాటు కాంగ్రెస్ సిట్టింగ్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరి మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తో ఓటమి చెందిన విషయం తెలిసిందే.
కెసిఆర్ ప్రతిపక్ష పార్టీల పట్ల ఉపయోగించే భాషను, బండి సంజయ్ కెసిఆర్ భాషలోనే మాటకు మాటకు సమాధానం ఇవ్వడం, సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రహ పాదయాత్ర లో కెసిఆర్ ను, ఆయన ప్రభుత్వ తీరును ఎండగట్టిన అనేక సంఘటనలు, సందర్భాల నేపథ్యంలో బండి సంజయ్ కార్యకలాపాలకు చెక్ పెట్టడం కోసం ఆయన కదలికలపై, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నాడు ? ఏ అంశాలు మాట్లాడుతున్నాడు ? మాట్లాడుతున్నది ఎవరు ? ఏ ప్రాంతం ? పాదయాత్రకు పత్రికా ప్రకటనలు ఇస్తున్నది ఎవరు ? భోజనాలు, వాహనాలు, విడిది ఏర్పాట్లు, పత్రికలో ప్రకటనలకు డబ్బులు చెల్లించిన సంస్థల పేర్లు, ఆర్థిక సహాయ సహకారాలు అందించిన వారి వివరాల కోసం సంజయ్ ఫోన్ ట్యాపింగ్ చేసి దాదాపు 78 పేజీల నివేదికను ఇంటలిజెన్సీ విభాగంలో కీలక అధికారులు కెసిఆర్ ప్రభుత్వానికి ఇచ్చినట్లు చర్చ. మీడియా సమావేశాల్లో అనేక సందర్భాల్లో సంజయ్, నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ప్రభుత్వంపై పలు ఆరోపణలు కూడా చేశారు.

👉రా నా ట్రాక్టర్ కు డ్రైవర్ గా చేస్తావా ?. కెసిఆర్

సీఎం హోదాలో కెసిఆర్ 2021 నవంబర్ లో ప్రగతి భవన్ లో వివిధ అంశాలపై పాత్రికేయుల తో మాట్లాడుతూ , బండి సంజయ్ ను ఉద్దేశిస్తూ ‘స్థాయి మరిచి నాపై మాట్లాడుతున్నావు,. నా ఫామ్ హౌస్ కు వస్తా , నా సంగతి చూస్తా అంటున్నావ్,’ రా నా ఫామ్ హౌస్ కు దున్నుతావా? నా ట్రాక్టర్ కు డ్రైవర్ గా చేస్తావా ? వచ్చి చూడు, ‘ బిడ్డ నీవు నాలుగు ముక్కలు అవుతావు కో… తస్మాత్ జాగ్రత్త అంటూ కెసిఆర్ ఆగ్రహంతో ఊగిపోతూ సంజయ్ ను హెచ్చరించిన విషయం తెలిసిందే.

👉నిఘా వర్గాల ద్వారా..?

బండి సంజయ్ కదలికల , పాదయాత్ర, సహాయ సహకారాలు అందించిన వారి వివరాలు సమయం, సందర్భం, ఎవరితో ఏం మాట్లాడారు తేదీలు, ఆయా ప్రాంతాలు, ఆయా వ్యక్తుల ఫోన్ నెంబర్లతో సహ, కెసిఆర్ తో స్నేహ సంబంధాలు కలిగి ఉన్న కొందరు బిజెపి అగ్ర నాయకులకు ఫోన్ ట్యాపింగ్ వివరాలు అందించడంతోపాటు ముందస్తు గానే కేంద్ర ఇంటిలిజెన్సీ వర్గాలకు అనధికారికంగా నివేదికలు అందించినట్టు చర్చలు జోరు అందుకున్నాయి.
ఈ నేపథ్యంలో కెసిఆర్ సామాజిక వర్గానికి చెందిన కేంద్ర నాయకుడు, రాష్ట్ర నాయకుడు ఢిల్లీలో పాత్రికేయులతో చిట్ చాట్ అంటూ బండి సంజయ్ వ్యవహార తీరు పై విమర్శలు చేయడం గమన హారం.

👉నా అధ్యక్ష పదవి మారుతుందని కెసిఆర్ ఊహల్లో ఉన్నాడు.. బండి సంజయ్.

తనను పదవి నుంచి తప్పించేందుకు
టిఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ తో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారు అని బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు.
“కేసీఆర్ రాష్ట్రంలో బీజేపీ నాయకత్వ మార్పుపై పుకార్లు పుట్టిస్తూ పార్టీ కార్యకర్తలను గందరగోళానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర అధ్యక్షుడిని మార్చే ప్రసక్తే లేదని మా పార్టీ ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ సహా బీజేపీ జాతీయ నాయకత్వం పలుమార్లు స్పష్టం చేసిందన్నారు. అయితే నా స్థానంలో మరొకరిని అధ్యక్షుడి గా నియమిస్తున్నట్లు కొన్ని మీడియా సంస్థలు పదే పదే కథనాలు ప్రచారం బాధాకరమని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. 2023లో జూన్ లో రాష్ట్రానికి వస్తున్న వందలాదిమంది ఆర్ఎస్ఎస్ ‘విస్తారకులకు’ స్వాగతం పలకడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చిన సందర్భంలో సంజయ్ మీడియాతో మాట్లాడారు.

👉బిజెపి అధ్యక్షుని మార్పులో కేసీఆర్ పాత్ర.. విజయశాంతి.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను మార్చడంలో కేసీఆర్ ప్రభావం, పాత్ర ఉందని సినీ నటి విజయశాంతి ఆరోపించారు. 2023 నవంబర్ లో ఆమె కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అమిత్ షా, జేపీ నడ్డా, నరేంద్ర మోదీ వంటి నేతలు కేసీఆర్‌ను అవినీతిపరుడని అభివర్ణించినా, ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని, పార్టీ కార్యకర్తలను, నేతలను బీజేపీ మోసం చేస్తోందని ఆమె అన్నారు.

ఇదిలా ఉండగా కేంద్ర బిజెపి నాయకత్వం 2023 జూలైలో బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పిస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన విషయం విధితమే. బండి సంజయ్ రాజకీయ కట్టడి అంశంలో సక్సెస్ అయినట్టు , అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష పార్టీల నాయకుల ఫోన్ ల ట్యాపింగ్ లకు ఖచ్చితంగా శ్రీకారం చుట్టి ఉంటారని, ప్రస్తుతం ఈ ట్యాపింగ్ వ్యవహారంలో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, డి.ఎస్.పి అరెస్టు చేసి విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి 2021 బాధ్యతలు చేపట్టారు. 2023 మే లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో, గత ప్రభుత్వం లో పోలీసులు రేవంత్ రెడ్డి ఫోన్ సంభాషణల వివరాల కోసం నిరంతరం నిఘ పెట్టినట్లు సమాచారం. సమగ్ర విచారణలో బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ ఉదంతం వెలుగుచూసే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.