బీఆర్ఎస్ పార్టీకి అచ్చిరాని పార్టీల అధ్యక్షులు చేరికలు !


J.SURENDER KUMAR,

మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, వ్యవస్థాపక అధ్యక్ష భారతీయ

రాష్ట్ర సమితి  (బీఆర్ఎస్) లోకి జాతీయ, రాష్ట్రస్థాయి

పార్టీల అధ్యక్షుల చేరికలు అచ్చి రావడం లేదు . వాస్తు,

ముహూర్తాలను బలంగా నమ్మే కెసిఆర్ పెట్టిన చేరికల

ముహూర్తలా  ? లేకా టిఆర్ఎస్ పార్టీలో చేరినా ఆయా పార్టీల

అధ్యక్షులు పెట్టుకున్న ముహూర్తాలో,  తెలియదు కానీ వారు

మాత్రం ఆ పార్టీలో ఇమడలేక బీఆర్ఎస్ ను వీడుతున్నది

జగమెరిగిన సత్యం.


బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుడు, కెసిఆర్ తర్వాత రెండవ స్థానంలో ఉన్న  కే కేశవరావు. గురువారం రాత్రి  కెసిఆర్ పార్టీతో తేగ తెంపులు చేసుకొని  కాంగ్రెస్ పార్టీలో నేడో ,రేపు చేరానున్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఆయన 2005 ఏప్రిల్ బాధ్యత చేపట్టారు. 2013 మే లో కెసిఆర్ సమక్షంలో నాటి టిఆర్ఎస్ పార్టీలో చేరి నిన్నటి వరకు కొనసాగారు.  ఆ పార్టీ పక్షాన రెండు పర్యాయములు రాజ్య సభకు నామినేట్ అయ్యారు.


కాంగ్రెస్ పార్టీలో జగమెరిగిన నేత 2004, 2009 లో ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గా  రెండు పర్యాయములు పనిచేసి న  డి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చిన ఘనత అయినది. 2015 జూలైలో నాటీ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ టికెట్ పై రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 2023 మార్చి లో  హైదరాబాద్ గాంధీ భవన్ లో డి శ్రీనివాస్  తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.


స్వర్గీయ ఆలే నరేంద్ర ( టైగర్ నరేంద్ర ) వ్యవస్థాపక అధ్యక్షుడిగా ‘ తెలంగాణ సాధన సమితి ‘పార్టీ నీ 2001 ఏర్పాటు చేశారు. రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ అభ్యర్థన మెరకు తన పార్టీ టిఆర్ఎస్ లో విలీనం చేశారు. కొంతకాలానికి నరేంద్ర టిఆర్ఎస్ పార్టీ నీ వీడారు. ప్రముఖ హీరోయిన్ విజయశాంతి ‘తల్లి తెలంగాణ పార్టీ’ వ్యవస్థాపకురాలు. కెసిఆర్ అభ్యర్థన మేరకు ఆమె తన పార్టీని టిఆర్ఎస్ లో విలీనం చేసింది. కెసిఆర్ తో విభేదాల నేపథ్యంలో ఆమె కాంగ్రెస్, బిజెపి,లో చేరి  ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నది.

తెలంగాణ టిడిపి పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ 2021 పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరి ప్రస్తుతం ఆ పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.


2014 లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి  పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య,.2023 లో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఎస్పీ చీఫ్ గా కొనసాగుతున్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పి కి రాజీనామా చేసి.  ఈ నెలలో బీఆర్ఎస్ లో చేరారు.


ప్రస్తుతం ఎల్ రమణ, పొన్నాల లక్ష్మయ్య, ప్రవీణ్ కుమార్ లు  బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. వీరికి బీఆర్ఎస్ పార్టీ అచ్చి వస్తుందో ?  రాదో  ? పార్లమెంట్ ఎన్నికలు ముగిసే వరకు వేచి చూడాల్సిందే.