డప్పుల పై కొప్పులా.. డప్పులు మోగించింది ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కు…


J.SURENDER KUMAR,


మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరున్న డప్పుల ను లయబద్ధంగా మోగిస్తూ ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను స్వాగతించిన సందర్భం గురువారం ధర్మపురి మండలంలో అగుపించింది.


సహజంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్న సందర్భాలలో కనిపించే దృశ్యం ఇధి. మండలంలోని నక్కలపేట లో పెద్దమ్మ తల్లి బోనాల ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ గ్రామస్తులు డప్పు చప్పుళ్ళతో ఘనంగా స్వాగతించిన సందర్భంలో ఆగుపించిన దృశ్యం ఇది.