J.SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనవలసినదిగా కోరుతూ ధర్మపురి ఆలయ ఉద్యోగులు, వేద పండితులు మంగళవారం హైదరాబాద్ లో దేవాదాయ కమీషనర్ ను కలసి ఆహ్వానించారు.
ఇటీవల దేవాదాయ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన హనుమంత రావు కు జాతర ఆహ్వనం తో పాటు స్వామివారి శేష వస్త్ర ప్రసాదం చిత్రపటం అందించారు.
దేవాదాయశాఖ వరంగల్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, పోలాస ఆలయ కార్య నిర్వహణ అధికారి పనతుల వేణుగోపాల్ అందజేశారు
ఇట్టి కార్యక్రమంలో దేవస్థానం వేదపండితులు పాలెపు ప్రవీణ్ కుమార్ శర్మ , సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ పాల్గొన్నారు.