ధర్మపురి బ్రహ్మోత్సవాలను అధికార యంత్రాంగం ఘనంగా నిర్వహించాలి !

👉ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి విధులు నిర్వహించాలి!

👉జాతర ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం లో..

👉జగిత్యాల అదనపు కలెక్టర్ దివాకర్!

J.SURENDER KUMAR,

ధర్మపురి  శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి అధికార యంత్రాంగం కేటాయించిన విధులను సమన్వయంతో నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర అన్నారు.
మంగళవారం జగిత్యాల కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి అధికారులు విధులు నిర్వహించాలని అన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు.

👉భక్తుల రద్దీ ఉత్సవాలలో….

ముఖ్యంగా స్వామివారి కళ్యాణోత్సవం, రథోత్సవం, డోలోత్సవం కార్యక్రమాలు జరిగే రోజులలో భక్తులు అధిక సంఖ్యలో  పాల్గొననున్నారని, భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి అధికార యంత్రాంగాన్ని నియమిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖులు, ముఖ్యులు దర్శనానికి వచ్చే సమయంలో ప్రోటోకాల్ పాటిస్తూ ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి విధులు నిర్వహించాలని సూచించారు..

👉క్యూ లైన్ లు…

ప్రధాన దేవాలయం, శివాలయంలలోకి వెళ్ళే భక్తులను క్యూ లైన్ నిర్వహణకు అవసరమైన పోలీస్, వాలంటీర్లను నియమించడం జరుగుతుందని,

👉పార్కింగ్ స్థలాలు…

వాహనాల పార్కింగ్ నకు బ్రాహ్మణ సంఘం, హరిత హోటల్ ప్రక్కన గల ప్రాంతాలలో పార్కింగ్ చేయవలసి ఉంటుందని తెలిపారు. ఎమర్జెన్సీ పార్కింగ్ కు జూనియర్ కళాశాల, నక్కల పేటలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

👉వైద్య శిబిరాలు….

దేవాలయం, మంగళ్ గడ్డ, కమ్యూనిటి హెల్త్ సెంటర్, నైట్  కాలేజి, బస్టాండ్ ప్రాంతాలలో మెడికల్ క్యాంపు లను నిరంతరంగా ఏర్పాటు చేయాలని అన్నారు.

👉చలివేంద్రాలు..

అవసరమైన కొన్ని ప్రాంతాలలో చలి వెంద్రాలు  ఏర్పాటు చేయాలని, త్రాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ప్రాంతాలలో త్రాగునీటి సౌకర్యం కల్పించాలని అన్నారు.  

👉కోనేటిలో బారికేడ్లు గజ ఈతగాళ్లు..

తెప్పోత్సవం, డోలోత్సవం జరిగే కోనేరు ప్రాంతంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా బారికేడింగ్ చేపట్టాలని, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని అన్నారు.

👉శానిటేషన్… కంట్రోల్ రూమ్..

అన్నదాన కార్యక్రమాలు జరిగే ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపట్టాలని, క్యూ లైన్ మెయింటేన్ చేయాలని అన్నారు.  సంతోషి మాతాఘాట్ వి.ఐ.పి. ఘాట్, మంగళ్ గడ్డ ఘాట్, హరిత హోటల్ వెనుక భాగాలలో శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని, దేవస్థానం ఆధ్వర్యంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని అన్నారు.

👉ఎల్.ఈ.డి. స్క్రీన్ లు..

స్వామివారికి జరిగే కార్యక్రమాలను పట్టణంలో వివిధ ప్రాంతాలలో చూసేందుకు ఎల్.ఈ.డి. స్క్రీన్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. జాతర జరిగే రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

👉రవాణా సౌకర్యం..అగ్నిమాపక వాహనాల!

జాతరలో  స్వామివారి దర్శనం చేసుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు రవాణ సౌకర్యాలకు ఆర్టీసి బస్సులను అందుబాటులో ఉంచాలని అన్నారు. ఆపదలో ఆదుకునేందుకు, విద్యుత్ షాట్ సర్క్యూట్ ను అదుపు చేయడానికి అగ్నిమాపక వాహనాలను సిద్దంగా ఉంచాలని అన్నారు.

👉విద్యుత్ అంతరాయం ఉండకూడదు..

జాతర సమయాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా నిరంతర విద్యుత్ సరఫరా అయ్యే విధంగా  ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు.


పట్టణంలో శానిటేషన్ కార్యక్రమాలను, మున్సిపల్, పంచాయతీ అధికారుల నేతృత్వలో నిర్వహించాలని అన్నారు. ఆయా విధుల నిర్వహణకు నియమించిన అధికారులకు అవసరమైన కింది స్థాయి ఉద్యోగులను కేటాయించడం జరిగిందని తెలిపారు.
ఈ సమావేశంలో డిఎస్పి రఘు చందర్, జగిత్యాల ఆర్దిఒ మధు సుధన్, వివిధ శాఖల జిల్లా అధికారులు, దేవాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.