ధర్మపురి జాతర హుండీ ఆదాయం ₹30 లక్షలు !

J. SURENDER KUMAR,

ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి జాతరలో స్వామివారికి హుండీ ద్వారా ₹ 30, 64, 396/- రూపాయల ఆదాయం వచ్చిందని కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు.

జాతర సందర్భంగా దేవస్థానము (14) రోజుల బ్రహ్మోత్సవములకు సంబందించినవి హుండీలో వచ్చిన ఆదాయం అని పేర్కొన్నారు. ( 16-03-2024 నుండి 30-03-2024 వరకు) మరియు మిశ్రమ బంగారము 57 గ్రాములు, మిశ్రమ వెండి 5 కిలోల 200 గ్రాములు విదేశి నోట్లు ఏడు వచ్చాయని పేర్కొన్నారు.


కరీంనగర్ సహాయ కమీషనర్, దేవాదాయశాఖ, ఈ చంద్రశేఖర్ పర్యవేక్షణలో ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది, బ్యాంకు సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు లెక్కింపులో పాల్గొన్నారు.