👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ఈ 20 నుండి ప్రారంభం కానున్న ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాటు చేపట్టామని, ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

సోమవారం మండల నాయకులతో కలిసి ధర్మపురి క్షేత్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా నంది చౌరస్తా నుండి దేవాలయం వరకు గల దారి, మరియు పార్కింగ్ స్థలం, త్రాగు నీటి సదుపాయం, బ్రహ్మం పుష్కరి వద్ద ఏర్పాట్లు గోదావరి వద్ద భక్తుల స్నానాలకు సంబందించిన భద్రత చర్యలను ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నూతన ఉత్సవ కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

కమిటీ సభ్యులు కూడా సమన్వయంతో పనిచేసి ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షించాలని, ప్రతి ఒక్కరి పై స్వామీ వారి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహ స్వామిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేవాలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు