ధర్మపురి జాతరలో డిస్ట్రిక్ట్ గార్డ్ అతి ఉత్సాహం !

👉జర్నలిస్టుల పట్ల దురుసు ప్రవర్తన..


J.SURENDER KUMAR,

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాలలో సోమవారం డిస్టిక్ గార్డ్ విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టు పట్ల దురుసుగా ప్రవర్తించారు.


వివరాల్లోకి వెళ్తే

శ్రీ ఉగ్ర నరసింహ స్వామి వారి డోలోత్సవ వార్త సేకరణకై పోలీసు ఉన్నతాధికారి జారీచేసిన పాసు పట్టుకుని ‘న్యూస్ భూమ్’ జర్నలిస్టు దక్షిణ ద్వారం గుండా లోనికి వెళ్లడానికి ప్రయత్నించాడు. ఆ ద్వారం వద్ద విధి నిర్వహణలో ఉన్న డిస్టిక్ గార్డ్ పోలీసు ఉన్నతాధికారి జారీచేసిన పాసు పట్టించుకోకుండా, దురుసుగా జర్నలిస్టుతో పాటు ద్వారం వద్ద వేచి ఉన్న భక్తులను వెనక్కు నెట్టి దురుసుగా ప్రవర్తించాడు.

పోలీసు ఉన్నతాధికారి జర్నలిస్టులకు జారీ చేసిన పాసుల

స్థానిక ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మరో ఇద్దరు జర్నలిస్టులు డిస్టిక్ గార్డ్ ప్రవర్తన తీరుపై నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ఎస్సై జోక్యం చేసుకొని కొన్ని సందర్భాల్లో ఇలానే జరుగుతాయి అంటూ సముదాయించారు.


ఇదిలా ఉండగా గత శుక్రవారం సాయంత్రం వేళ పెట్రోలింగ్ పోలీసు వాహనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రాజగోపురం ముందు భక్తజనంతో రద్దీగా ఉండే దారిలో నిలిపి వాహన డ్రైవర్ వెళ్లిపోయాడు. అదే సమయంలో స్వామివారి ఉత్సవ సేవ, గోపురం నుండి బయటకు వచ్చింది. దారికి అడ్డుగా వాహనం ఉంది. వాహన డ్రైవర్ కోసం ఒక ఉద్యోగం అందుబాటులో లేడు . స్వామివారి సేవను మోసే బోయలు పక్కదారి గుండా వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.

వెంకటేశ్వర స్వామి రాజగోపురం ముందు పోలీస్ వాహనం


సమర్ధులైన పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని. సంబంధిత పోలీస్ డిస్టిక్ గార్డుపై చర్యలు తీసుకొని, భక్తజనం రద్దీగా ఉండే స్వామి వారి రథోత్సవం రోజు ఇలాంటి సంఘటనలు భక్తజనంకు జర్నలిస్టులకు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

రాజగోపురం దారి.