J.SURENDER KUMAR,
జాతరకు .. పోతే పాత్ర కొనుగోలు చేయాలనే నానుడిని.. జగిత్యాల కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆచరించారు. జిల్లా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆమె. జాతర ఉత్సవాలు ప్రభుత్వ ప్రతినిధిగా గురువారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి కలెక్టర్ పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అప్పగించారు. జాతరలో అధిక శాతం భక్తులు ఆచరిస్తున్న సాంప్రదాయాన్ని ఆమె ఆచరించారు.
ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం కొనసాగుతున్న బొమ్మలు, గాజుల దుకాణంలో కలెక్టర్ సాధారణ భక్తిరాలిగా దుకాణం యజమానురాలని అడిగి తాను ధరిస్తున్న గాజు సైజును ఆమె కొనుగోలు చేశారు. ఐదు వందల రూపాయలను దుకాణం నిర్వాహకురాలికి ఇచ్చి గాజులు కొనుగోలు చేసింది.

మిగతా డబ్బులను దుకాణం నిర్వాహకురాలు తిరిగి ఇస్తుండగా కలెక్టర్ నవ్వుతూ సున్నితంగా తిరస్కరించంది.
కలెక్టర్ గాజులు కొనుగోలు చేయడంలో ఏలాంటి ప్రత్యేకత లేనప్పటికీ. సామాన్య భక్తురాలిగా, సనాతన సాంప్రదాయాన్ని కలెక్టర్ పాటించడం తో గాజులు కొనుగోలు అంశం భక్తజనంలో ఎనలేని ప్రాధాన్యత తో పాటు కలెక్టర్ తీరును భక్తజనం హర్షిస్తున్నారు.