👉ఆ వేద గోషా వినపడదు. వేద పురుషుడు అగుపించుడు!!
J.SURENDER KUMAR,
ధర్మపురి క్షేత్రానికి చెందిన వేద పండితులు,(97) సంవత్సరాలు మధు సాంబయ్య ఘనాపాఠీ బుధవారం కన్ను మూశారు.
వేద శాస్త్రాలను ఔపోసన పట్టి, సాంబయ్య ఘనాపాఠీ 97 సంవత్సరాలు వయసులో కళ్ళజోడు లేకుండా చదివేవాడు. ఒంటరిగా ఉన్న సామూహికంగా ఉన్న ఆయన వేదం పటిస్తూ అగుపించేవారు. నిత్యం శివాలయం, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయలో ఏలాంటి ప్రతిఫలం ఆశించకుండా వేద పారాయణం చేస్తూ భక్తజనంకు ఆగుపించేవారు.
సాక్షాత్తు వేద పురుషునిగా భావించబడే సాంబయ్య ఘనాపాఠీ, వేద ఘోష వినిపించదు, ఇక ఆ వేద పురుషుని రూపం అగుపించదు అని వేద పండితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం పవిత్ర గోదావరి నది తీరంలో ఆయన పార్టీ దేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి.