J. SURENDER KUMAR,
నవ నరసింహ స్వామి క్షేత్రాలలో ఒకటైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో అంతర్భాగంగా సోమవారం ఆలయంలోని శేషప్ప కళావేదికపై సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైనాయి.

త్యాగరాజ స్వామి చిత్రపటంతో ఆలయ సంకీర్తన తో కార్యక్రమాలు ప్రారంభమైనాయి. జ్యోతి ప్రజ్వలన పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఉత్సవాల్లో త్యాగరాజ స్వామి జీవిత చరిత్ర గురించి కొరిడే రమాదేవి వివరించారు. అనంతరం డాక్టర్ సంగనభట్ల నరసయ్య, కొరిడే నరహరి ఆలపించిన త్యాగరాజ పంచరత్న కీర్తనలు శ్రోతలను మంత్రముగ్దులను చేసింది. గాయకుల గుండి జగదీశ్వర్, అనిల్, సంజీవ్, ఉత్సవ కమిటీ సభ్యులు జక్కు రవీందర్, సాయి, గణేష్, శ్రీధర్,. కార్యనిర్వహణాధికారి సంకటల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.