J.SURENDER KUMAR,
ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బుధవారం నియోజకవర్గంలో బుధవారం ఆధ్యాత్మిక పర్యటన చేపట్టారు.
,👉పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట !

వెల్గటూర్ మండలం శాకపూర్ లోని పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
👉మల్లికార్జున స్వామి ఆలయాన్ని..

ధర్మారం మండలం నంది మేడారంలోని మల్లికార్జున స్వామిని, ఇదే మండలం నర్సింహుల పల్లె లో ఎల్లమ్మ దేవాలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం దొంగతుర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి నీ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
👉ఎల్లమ్మ పట్నాలు…

ఎండపల్లి మండల కేంద్రంలో ఎల్లమ్మ పట్నాల ఉత్సవంలో లక్ష్మణ్ కుమార్ పాల్గొని ఎల్లమ్మ దేవి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ తోపాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు జితేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్, మాజీ ప్రజాప్రతినిధులు మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.