ధర్మపురి నరసింహుడి డోలోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

👉భక్తులకు అసౌకర్యం కలగవద్దు

J.SURENDER KUMAR,

ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఉత్సవాలు సోమవారం జరిగిన శ్రీ యోగ నారసింహస్వామి ఉత్సవంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

జాతర సందర్భంగా స్వామివారిని దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆలయ అధికారులను ఆదేశించారు.
బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ విషయంలో ఇబ్బందులు లేకుండా చూడాలని, నంది విగ్రహం నుండి దేవాలయానికి వెళ్ళే దారిలో ఎలాంటి వాహనాలను కూడా అనుమతించరాదని అన్నారు.
అన్నదాన నిర్వహణలో భక్తులకు నాణ్యమైన బోజనాన్ని అందించాలని, నాసిరకం బియ్యాన్ని కాకుండా నాణ్యమైన బియ్యాన్ని వినియోగించాలని ఆదేశించారు. ఈ విషయంలో తన నుండి ఎలాంటి సహకారం అవసరం ఉన్న అందిస్తామని నిర్వాహకులకు వివరించారు.
రాత్రి వేళ భక్తుల ప్రయాణ సౌకర్యార్థం కూడా RTC బస్సులు కూడా ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే వివరించారు.

👉పార్లమెంట్ ఎన్నికల తర్వాత..

ధర్మపురి క్షేత్రం నుండి హైదరాబద్ కు భక్తుల ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రత్యేకంగా ఎసి బస్సు ను కొనసాగిస్తామన్నారు.
ఈ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారని, సంబంధిత అధికారులకు మౌఖికాదేశాలను మంత్రి జారీ చేశారన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉందన్నారు.


👉శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో..


ధర్మారం మండలం దొంగతుర్తి, గోపాల్ రావు పేట లో శ్రీ వేంకేశ్వరస్వామి నీ దర్శించుకొని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కల్యాణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు, ఎమ్మెల్యేలు వేదమంత్రాలతో స్వామివారి శేష వస్త్రాలతో ఘనంగా సన్మానించారు .


👉మల్లన్న పట్నాలలో..


బుగ్గారం మండలం గోపులపూర్ లో సోమవారం రాత్రి జరిగిన శ్రీ మూలుగం మల్లన్న పట్నాల పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.


👉సిసి రోడ్డు మంజూరు..

ఈ సందర్భంగా ఆలయానికి సీసీ రోడ్డు మరియు బోర్ మోటార్ కావాలని భక్తులు ఆలయ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. వాటిని మంజూరు చేస్తూ, యాదవ సంఘ భవనంకు ప్రహరీ గోడ మంజూరు కు హామీ ఇచ్చారు.
👉పరామర్శ..


రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి పోనుగోటి నవీన్ రావు, నర్సింగరావు తల్లి పొనగోటి విమలదేవి మృతిచెందగా, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. విమలాదేవి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే అంతక్రియల్లో పాల్గొన్నారు