👉స్వామి వారి కళ్యాణాన్ని తిలకించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ , ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్
👉సాంప్రదాయ దుస్తులతో మంత్రి, ఎమ్మెల్యే
J. SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం తిలకించడానికి వచ్చిన భక్తజనంతో ధర్మపురి క్షేత్రం గురువారం పోటెత్తింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఏ .లక్ష్మణ్ కుమార్, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ పంగి సత్యమ్మ తదితర ప్రజా ప్రతినిధులు స్వామివారిని దర్శించుకుని కళ్యాణాన్ని తిలకించారు.

శేషప్పకళా వేదికపై గోధులి సమయంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని యోగ, యమ ధర్మరాజు, వెంకటేశ్వర స్వామి, కొత్త నరసింహ స్వామి, వేణుగోపాలస్వామి, ఆలయ ప్రాంగణాలు, పరిసరాలు భక్తజనంతో కిటకిటలాడింది. మంత్రి ప్రభాకర్ గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

కళ్యాణ అనంతరం అర్చకులు వేద పండితులు, మంత్రి ప్రభాకర్ గౌడ్ ను వేద ఆశీర్వచనం చేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు జక్కు రవీందర్, బృందం, కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్, వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ, ప్రధాన అర్చకుడు నంబి శ్రీనివాసాచార్యులు, స్వామి వారి కళ్యాణం నిర్వహించారు. ప్రముఖ ప్రవచకుడు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి స్వామి వారి కళ్యాణం వ్యాఖ్యాతగా వివరించారు.

స్వామి వారి కళ్యాణం భక్తులు తిలకించడానికి పట్టణంలోని కూడళ్లలోడిజిటల్ స్క్రీన్ లు ఏర్పాటు చేశారు.

బ్రహ్మోత్సవాల భక్తులకు ఉచిత అన్నదానం !
పది వేల విరాళం ఇచ్చిన ఎమ్మెల్యే..

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థము ఓల్డ్ టిటిడి ధర్మశాలలో ఏర్పాటు చేసిన ఉచిత అన్నదానం ఏర్పాటు చేశారు. అన్నదానం ప్రారంభించిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ తనవంతుగా అన్నదానానికి 10 వేల రూపాయల విరాళాన్ని అందజేశారు.
.