👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J. SURENDER KUMAR,
ధర్మపురి నియోజక వర్గ ప్రజలకు తాగు, సాగు నీరు అందించే విషయంలో మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ఎండపెల్లి మండలం వేమునూర్ పంప్ హౌజ్ ను సోమవారం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండల నాయకులతో కలిసి పరిశీలించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.
తాను ఎమ్మెల్యే గా గెలిచిన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి మన ప్రాంత సాగు నీటి ఇబ్బందులను వివరించామన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం తక్కువగా ఉండటం వలన రైతులకు సాగు నీరు అందించే విషయంలో కొంత సమస్య ఏర్పడిందన్నారు. వేమునూర్ పంప్ హౌజ్ కు మరమ్మతులు పూర్తిచేసి తిరిగి ప్రారంభించినందుకు సంబంధిత అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అన్నారు.

గత ప్రభుత్వంలో ఉన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ , ఏనాడు రైతుల సాగు నీటి సమస్య పై ఆలోచించలేదు అని ఆరోపించారు. సాగు, త్రాగు నీటి విషయంలో శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి ని కలిసి కృషి చేస్తానన్నారు. ఎల్లంపెల్లి మరియు కాలేశ్వరం లింక్ 2 లో కూడా తమ ప్రాంత నీటి వాట తీసుకున్న తర్వాతే ఎగువకు నీటిని తీసుకుపోవడానికి అనుమతి ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు