J.SURENDER KUMAR,
ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్లు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం లబ్ధిదారులకు ₹ 2.57 కోట్లు విలువగల చెక్కులను పంపిణీ చేశారు.
120 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ₹ 1,39,20,000/- విలువ గల చెక్కులను వారికి అందించారు. 81 మందు దివ్యాంగులకు ఒక్కొక్కరికి ₹ 50 వేల చెక్కులను, మరో ఐదుగురికి ₹ 1 లక్ష రూపాయల చొప్పున లాభక్తులకు పంపిణీ చేశారు.
ధర్మారం మండలంలో 78 కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ₹78,01248 విలువ గల క చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ… ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటిలలో రెండు హామీలను అమలు చేయడం జరిగిందని, మరో రెండు హామీలను అమలు ప్రక్రియలో కొనసాగుతున్నదన్నారు.

అర్హులైన ప్రతి పేదవారికి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబందించిన పలాలు అందించేలా చూస్తామని, పేద ప్రజల సంక్షేమం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ రాజీపడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు