ధర్మపురి సెగ్మెంట్ లో బీఆర్ఎస్ కు మరో షాక్ !

👉పార్టీ మారనున్న సిట్టింగ్ జడ్పిటిసి, ఎంపీపీ !

👉చర్చలు జరుపుతున్న కేటీఆర్ దూతలు ?

J.SURENDER KUMAR,


పార్లమెంట్ ఎన్నికల ముందు ధర్మపురి  సెగ్మెంట్  లో

పెగడపల్లి సిట్టింగ్ జెడ్పిటిసి సభ్యుడు రాజేందర్ రావు,

వెలగటూరు మాజీ ఎంపీపీ శ్రీనివాసరావు కొన్ని రోజుల క్రితం

బీఆర్ఎస్ పార్టీనీ వీడి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్

తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఇదే సెగ్మెంట్ లో

మరో బలమైన షాక్ బీఆర్ఎస్ పార్టీకి తగలనున్నట్టు

సమాచారం. బుగ్గారం సిట్టింగ్ జడ్పిటిసి, బాదినేని రాజేందర్,

(ఆయన భార్య)  మండల పరిషత్ అధ్యక్షురాలు రాజమణి

బీఆర్ఎస్ ను వీడనున్నట్టు సమాచారం. ఆ పార్టీ వర్కింగ్

ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తన దూతలను

మంగళవారం రాత్రి రాజేందర్ దగ్గరికి పంపించి బుజ్జగింపు,

సంప్రదింపులు చేసినట్టు సమాచారం. ఇప్పుడు బుజ్జగించినా ,

చర్చించినా రాజకీయంగా మాకు, మా సామాజిక వర్గానికి,

జరిగిన నష్టం పూడ్చలేరని రాజేందర్ అనుచరులు వారిని

నిలదీసినట్టు తెలిసింది.


నిజాంబాద్ పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, రాజేందర్ ను కలిసి చర్చించినట్లు తెలిసింది. గత రెండు రోజుల క్రితం పెద్దపల్లి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి గోమాస శ్రీనివాస్, ప్రత్యేకంగా జగిత్యాల కు రాజేందర్ ఇంటికి చేరుకొని దాదాపు రెండు గంటల పాటు మంతనాలు జరిపినట్టు సమాచారం. కేంద్ర బిజెపి కీలక నేతతో ఫోన్ ద్వారా రాజేందర్ తో మాట్లాడించడానికి ప్రయత్నించినట్టు సమాచారం.   ఈ నేపథ్యంలో పెద్దపల్లి ఎంపీ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అనుచరుడు. రాజేందర్ కు ఫోన్ చేసి పార్లమెంట్ ఎన్నికలను ఎలా ఎదుర్కొందాం.. ప్రత్యేకంగా లిమిటెడ్ నాయకులం కీలక సన్నాహక సమావేశం ఎప్పుడు ఏర్పాటు చేద్దాం,  అంటూ ఫోన్ చేసినట్టు తెలిసింది.  కీలక సమావేశం మీరే ఏర్పాటు చేసుకోండి, మీరే ఎన్నికలను ఎదుర్కొండి అంటూ రాజేందర్ ఆగ్రహంతో మాట్లాడుతూ,  మరోసారి నాకు ఫోన్ చేయవద్దని  మాజీ మంత్రి  అనుచరుడిని రాజేందర్ దంపతులు హెచ్చరించినట్లు సమాచారం.

పెద్ద పల్లి బిజెపి అభ్యర్థి శ్రీనివాస్


గత  కొన్ని రోజుల క్రితం  బాదినేని  రాజేందర్, ధర్మపురి, జగిత్యాల, సెగ్మెంట్లలో తన అనుచర వర్గం తో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ లో తనకు రాజకీయంగా జరిగిన నష్టం తోపాటు,  నియోజకవర్గంలో బుగ్గారం మండలం మినహా  ఇతర మండల రాజకీయల్లో జోక్యం చేసుకోవద్దు అంటూ కీలక నేత కట్టడి చేసిన అంశం, చర్చకు వచ్చినట్టు తెలిసింది. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి, జగిత్యాల జిల్లా పరిషత్ చైర్మన్ పదవి లో జరిగిన అన్యాయం, తదితర అంశాలు, అవమానాలను చర్చించినట్టు తెలిసింది.  రాజేందర్ ను బీఆర్ఎస్ కు రాజీనామా చేయాలని,  సమావేశంలో అనుచర వర్గం ఒత్తిడి చేసినట్టు సమాచారం.

నిజామాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్


బాదినేని రాజేందర్ ధర్మపురి మండలం గోపులాపూర్ తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీగా గెలిచి కాంగ్రెస్ పార్టీ మండల పరిషత్ అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం లో టిడిపి ఎంపీపీగా బాధ్యతలు చేపట్టారు. 2008 లో ఎంపీపీ హోదాలో కెసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. టిఆర్ఎస్ పార్టీ పక్షాన ధర్మపురి జెడ్పిటిసిగా, ఎంపీపీగా రాజేందర్ దంపతులు కొనసాగారు. నూతనంగా ఏర్పడిన బుగ్గారం మండల జెడ్పిటిసి గా, గెలిచిన రాజేందర్, తన భార్య రాజమణి ని. బుగ్గారం ఎంపీపీగా గెలిపించుకున్నారు.

రాజేందర్ తో విఆర్ఎస్ నాయకుల చర్చలు


2009 అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపులో కిలకపాత్ర వహించారు.  జరిగిన అనేక ఉప ఎన్నికలతో పాటు 2014, 2018, ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ గెలుపులో ఆయన తో పాటు ఆయన అనుచర వర్గంది కీలక పాత్ర. మాజీ సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, రాజ్యసభ సభ్యులు కేశవరావు, తదితర బీఆర్ఎస్ కీలక నేతలతో స్నేహ సంబంధం ఉన్నప్పటికీ. రాజేందర్ రాజకీయ ఎదుగుదలకు అడ్డంకులు సృష్టించిన, సృష్టిస్తున్న నాయకులకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకరిస్తున్నారని రాజేందర్ పలు సందర్భాల్లో బహిరంగంగా ఆరోపించారు.

ప్రధానంగా జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కి జిల్లా మంత్రి హోదాలో తనకు సిఫారసు చేయలేదని ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. 2018 ఎన్నికల్లో నాటి రాష్ట్ర బిజెపి పార్టీ  అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, పార్టీలోకి రావలసిందిగా  రాజేందర్ తో చర్చలు జరిపారు.  నాడు బీఆర్ఎస్ అగ్రనాయకత్వం, అప్పటి ధర్మపురి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రాజేందర్ ను బుజ్జగించారు. జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘ అధ్యక్షుడిగా కొనసాగుతున్న రాజేందర్ ను ఆయన సామాజిక వర్గాన్ని రాజకీయ ఎదుగుదలను అడ్డుకుంటున్న  బీఆర్ఎస్   కీలక నాయకుడు, ఒకరు తప్పుడు కేసులు నమోదు చేయించడం, అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు అంటూ అధికార యంత్రాంగంను అడ్డుపెట్టుకొని  విచారణల  పేరిట   వేధింపులకు పాల్పడడంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆ నాయకుడి పై ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం.

పెద్ద పెళ్లి బిజెపి అభ్యర్థి శ్రీనివాస్ తో చర్చలు

ఆ నాయకుడికి ఇదే పార్టీకి చెందిన ఓ కీలక నేత పరోక్షంగా సహకరిస్తున్నాడనే  అనుమానం రాజేందర్ కు ఉంది.  పెద్దపల్లి పార్లమెంటుతో సహా,  నిజాంబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లలో రాజేందర్ తో పాటు, ఆయన సామాజిక వర్గ ప్రభావం 20 30 శాతం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొన్ని రోజుల్లోనే రాజేందర్ దంపతులు తన అనుచర వర్గంతో బీఆర్ఎస్ పార్టీ వీడనున్నట్టు సమాచారం.