👉కాంగ్రెస్ లో చేరిన జడ్పిటిసి, మాజీ ఎంపీపీ..
👉ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ తో సీఎం రేవంత్ రెడ్డి వద్దకు..
👉రాష్ట్ర ఇంచార్జ్ దీపా దాస్ మున్షి సమక్షంలో చేరిక!
J.SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గంలో భారతీయ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు, పొనుగోటి శ్రీనివాసరావు, ఇదే సెగ్మెంట్ పెగడపల్లి మండల సిట్టింగ్ జడ్పిటిసి సభ్యుడు రాజేందర్ రావు, జిల్లా రా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు నూనె శ్రీనివాస్ శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ తో కలసి మీరు ముందుగా సీఎం రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగా సీఎంను కలిశారు. కొద్ది సమయం లోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ దీపా దాస్ మున్షి సమక్షంలో హైదరాబాద్ గాంధీ భవన్ లో వీరికి కాంగ్రెస్ కండువా ఆమె పార్టీలో కి స్వాగతించారు.

ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో 2014 నుంచి టిఆర్ఎస్ పార్టీకి వెన్నెముకగా ఉన్న వెల్గటూర్ మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాసరావు (పీ ఎస్ ఆర్) ఏకగ్రీవ ఎంపీటీసీ, మండల పరిషత్ అధ్యక్షుడుగా కొనసాగారు.
నూతనంగా ఆవిర్భవించిన జగిత్యాల జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తన అనుచర వర్గం కు వెల్గటూర్ మండల జెడ్పిటిసి పదవి ఏకగ్రీవం చేసి కట్టబెట్టారు. బీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకత్వంతో బంధుత్వాలు, స్నేహ సంబంధాలు ఉన్న పొనుగోటి శ్రీనివాసరావు,కు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు మధ్య గత కొంత కాలంగా గ్యాప్ పెరిగింది. మంత్రి హోదాలో ఈశ్వర్ శ్రీనివాసరావు అనుచర వర్గ ఆదిపత్యానికి అడ్డంకులు సృష్టించడం, తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారనే చర్చ నాడు జరిగింది.

దీనికి తోడు వెల్గటూరు మండలంలో శ్రీనివాసరావు రాజకీయ ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి ఇదే మండలంలోని కొన్ని గ్రామాలను కలిపి ఎండపల్లి మండల కేంద్రం చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. కొప్పుల ఈశ్వర్ కు మద్దతుగా ప్రచారం చేయాలని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాసరావు ను కోరినా, తాను బెల్లంపల్లి ఇన్చార్జి బాధ్యత నిర్వహిస్తూ ధర్మపురి సెగ్మెంట్లో ప్రచారం చేయడం సాధ్యం కాదని వివరించినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పొనుగోటి శ్రీనివాసరావు, అతడి అనుచర వర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ గెలుపుకు సహకరించారనే ఆరోపణలతో పాటు, శ్రీనివాసరావు లక్ష్మణ్ కుమార్ కు అన్ని విధాల సహకరించాడు అనే చర్చ ఉంది.

త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ధర్మపురి నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, దీపా దాస్ మున్షి పార్టీలో చేరిన వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ టీ సిలు జాడి సుజాత రాజేశం, రంగు సుజాత మాజీ సర్పంచులు గెల్లు శేఖర్ యాదవ్, నిషాంత్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్, రావు సుగ్రీవరావు,గొర్ల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎలుక రాజు యాదవ్, యాదవ సంఘం మండల అద్యక్షులు మాచర్ల రాజేందర్ కాంగ్రెస్ నాయకులు గొపతి నరేష్, రమేష్ యాదవ్ తదితరులు ఉన్నారు.