👉కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ !
J.SURENDER KUMAR,
ఈనెల 20 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు 13 రోజులపాటు జరగనున్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి జాతరకు విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్టు ఆలయ కార్య నిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
👉ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశములు, సూచనల మేరకు భక్తులకు ఏలాంటి ఇబ్బందులు, అసౌకర్యం కలుగకుండా విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్టు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలలో పేర్కొన్నారు.
ఏర్పాట్ల వివరాలు..
👉బ్రహ్మోత్సవముల సందర్భముగా అన్ని దేవాలయములకు రెండు రాజ గోపురలకు, బ్రహ్మ పుష్కరిణి (కొనేరు), స్వాగత తోరణాలకు మరియు ఇతర అవసరమైన చోట్ల రంగులు/సున్నాలు వేయించబడుచున్నవి.
👉దేవాలయము లోపల, వెలుపల మరియు గోదావరి నది తీరములో తడుకలతో చలువ పందిర్లు, స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి వీలుగా ప్రస్తుతము గల డ్రెస్స్ చెంజింగ్ రూమ్స్ పాటు అధనముగా తడకలతో డ్రెస్సింగ్ రూములు కూడా ఏర్పాటు చేయడం జరుగుచున్నది.
👉బ్రహ్మోత్సవాలు విస్తృత ప్రచారం నిమిత్తం పూర్వపు ఉమ్మడి జిల్లాలు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో పాటు మహరాష్ట్రలోని నాందేడ్ జిల్లాలకు వాల్ పోస్టర్లు, కరపత్రములు పంపించడం జరుగుచున్నది.
👉బ్రహ్మోత్సవాలు విస్తృత ప్రచారం నిమిత్తం పూర్వపు ఉమ్మడి జిల్లాలు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో గల పట్టణాలు, గ్రామలలో ఫ్లెక్సి బ్యానర్స్ ఏర్పాటు చేయుట జరుగుచున్నది.
👉దేవాలయము లోపల వెలుపల ప్రత్యేక క్యూలైన్స్, కౌంటర్లు ఏర్పాట్లు చేయడం జరుగుచున్నది.
👉గత సంవత్సరము కన్న రాజగోపురలకు, దేవాలయలకు, స్వాగత తోరణాలకు అదనముగా విద్యుత్ దీపాలంకరణ, లైటింగ్ బోర్డులు మరియు గ్రామంలో ప్రత్యేకంగా విద్యుత్ అలంకరణ వేయించుట జరుగుచున్నది.
👉శాసన సభ్యులు ప్రభుత్వ విప్ మరియు జిల్లా కలెక్టర్ ఆదేశముల ప్రకారం గతములో కంటే ఈ సంవత్సరము అదనముగా పూల అలంకరణ ప్రధాన దేవాలయములతో పాటు అనుబంధ ఆలయములకు అలంకరణ, కళ్యాణోత్సవ వేదిక ప్రత్యేక అలంకరణ, బ్రహ్మపుష్కరిణి మరియు ఇతరత్ర అవసరమైన ప్రదేశంలలో అలంకరణ చేయడానికి చర్యలు గైకొనబడుచున్నవి.
👉 భక్తుల సౌకర్యార్థం దేవస్థానము పక్షాన, స్వచ్చంద సంస్థలు మరియు దాతల సహాకారంతో దేవాలయం లోపల, వెలుపల, గోదావరినది తీరములో మరియు ఇతర చోట్ల మంచి నీటి చలివేంద్రముల ఏర్పాటు చేయుటతో పాటు శ్రీస్వామి వారి దర్శనార్థం వచ్చు భక్తులకు కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ వారి సహాకారంతో చల్లటి మజ్జిగ ప్యాకెట్లు భక్తులకు వితరణ చేయడానికి చర్యలు గైకొనబడుచున్నవి.
👉గత కొన్ని సంవత్సరముల వలె బ్రహ్మోత్సవముల సందర్భముగా దేవస్థానం వారి అధ్వర్యములో క్షేత్రానికి విచ్చేయు భక్తులకు భోజన వసతి ఈ సంవత్సరము కూడా స్థానిక ప్రజాప్రతినిధులు, ఆర్యవైశ్య, వర్తక సంఘం, రైస్ మిల్లర్స్, దాతలు, స్వచ్చంద సంస్థలు, గ్రామస్తుల సహాకారంతో ఉచిత అన్నదానం చేయడానికి చర్యలు గైకొనబడుచున్నవి.
.👉 భక్తుల సౌకర్యార్థం అధిక మొత్తంలో లడ్డు ప్రసాదం మరియు పులిహోర ప్రసాదం తయారు చేయించి భక్తులకు విక్రయించడానికి వీలుగా చర్యలు గైకొనబడుచున్నవి.
👉 జిల్లా కలెక్టర్ ఆదేశముల ప్రకారము స్థానిక
తహసీల్దార్, మున్సిపల్ కమీషనర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మరియు సబ్ – ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ లతో, ఇతర అధికారులతో ఇట్టి జాతర ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యము వాటిల్లకుండా తక్షణ చర్యలు గైకొనుటకు గాను కోఆర్డినేషన్ చేసుకుంటూ జాతరను నిర్విఘ్నముగా జరుపుకొనుటకు చర్యలు గైకొనబడుచున్నవి.
👉 గత సంవత్సరం వలె దేవస్థానం పక్షాన భద్రత నిమిత్తం పోలీస్ వారి పర్యవేక్షణలో 50 సి.సి. కెమెరాలు దేవాలయ పరిసరాల్లో, గోదావరినది తీరంలో, ధర్మపురి పట్టణం మొత్తంలో గల ప్రధాన కుడళ్ళలలో ఏర్పాటు చేయుటకు చర్యలు గైకొనబడుచున్నవి.
భక్తుల సౌకర్యార్థం ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటనలు ఈవో పేర్కొన్నారు.