J.SURENDER KUMAR,ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ జాతర ఉత్సవాల్లో భాగంగా ఆదివారం బ్రహ్మ పుష్కరణలో జరిగిన స్వామివారి తెప్పోత్సవం, శ్రీ యోగ నరసింహుడి డోలోత్సవ కార్యక్రమంలో

స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు..ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
👉రథోత్సవంలో..

వెల్గటూర్ మండలం కిషన్ రావుపెట్ గ్రామం గుట్టపై స్వయంభుగ వెలసిన శ్రీ నాగపల్లి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో బాగంగా ఆదివారం జరిగిన స్వామి వారి రథోత్సవంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

👉కాంగ్రెస్ పార్టీలో చేరికలు..

వెల్గటూర్ మండల కేంద్రంలో ఆదివారం ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో వెల్గటూర్ మాజీ ప్యాక్స్ చైర్మన్ పోనుగోటి రామ్మోహన్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈయనతో పాటు కిషన్ రావుపెట్ ,సత్యనారాయణ రావు, కుమ్మరిపల్లి మాజీ సర్పంచ్ ముచ్చర్ల మల్లయ్య పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి, పైసల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
