ధర్మపురి వ్యాపారి అరవింద్ నిజాయితీ !

👉లక్షలాది రూపాయల ఆభరణాల అప్పగించిన వ్యాపారి !

👉భక్తులు పోగొట్టుకున్న సొమ్ము.


J.SURENDER KUMAR,

ధర్మపురి శ్రీ లక్మి నర్సింహ స్వామి జాతర ఉత్సవాలకు వచ్చిన భక్తులు పోగొట్టుకున్న లక్షలాది రూపాయల ఆభరణాల బ్యాగునుపోలీసుల ద్వారా వారికి అందజేసి ధర్మపురి కిరాణం వ్యాపారి అక్కనపల్లి అరవింద్ తన నిజాయితీని చాటుకున్నారు.


వివరాలు ఇలా ఉన్నాయి.
గురువారం సాయంత్రం జరిగిన స్వామివారి కల్యాణ మహత్సవం చూసి తిరుగు ప్రయాణమవుతున్న ఇటిక్యాల స్వాతి సదాశివ పేట, సంగారెడ్డి జిల్లా కు చెందిన వారు. కారు లో వెళ్తుండగా అక్కనపల్లి అరవింద్ కిరాణం షాపు దగ్గరలో వారి బ్యాగు కింద పడిపోయింది,

కీరాణం షాపు యజమాని అక్కనపల్లి అరవింద్ అట్టి బ్యాగు గుర్తించి ధర్మపురి పోలీస్ లకు సమాచారం ఇవ్వగా వెంటనే పోలీస్ లు అట్టి బ్యాగును కంట్రోల్ రూమ్ వద్దకు తీసుకు వచ్చి చెక్ చేయగా 3 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు సుమారు 2 లక్షల విలువ గలవి వున్నవి, వెంటనే బ్యాగులో ఉన్న ఆధార్ కార్డు ఆదరంగా వారికి సమాచారం ఇచ్చారు. బంగారు, వెండి ఆభరణాలను వారికి అప్పగించనైనది. నిజాయితీని చాటుకున్న అక్కనపల్లి అరవింద్ ను ధర్మపురి సి ఐ, ఏ. రామ్ నర్సింహ రెడ్డి గారు, ఎస్ ఐ, పి.ఉదయ్ కుమార్, పట్టణ వాసులు అభినందించినారు.