ఫ్లాష్ ..ఫ్లాష్ ధర్మపురి లో చైన్ స్నాచింగ్ ?

J.SURENDER KUMAR,


ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి పట్టణ శివారులో శుక్రవారం సాయంత్రం చైన్ స్నాచింగ్ జరిగినట్టు సమాచారం.
ధర్మపురి రాయపట్నం జాతీయ రహదారిపై గంప నెత్తిన పెట్టుకొని దోసకాయల విక్రయిస్తున్న మహిళను. ఎరుపు రంగు కలర్ పల్సర్ ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు హెల్మెట్ ధరించి ఉన్నారు దోసకాయలు కొనుగోలు చేస్తున్నట్టు నటించారు.

తలపై గంప కిందికి దించుతుండగా ఆమె మెడలోని బంగారు గొలుసు తెంపుకొని యువకులు రాయపట్నం వైపు పారిపోయినట్టు సమాచారం. ప్రత్యేక పోలీసులు బలగాలు రంగ ప్రవేశం చేసి, రాయపట్నం, తిమ్మాపూర్, బూరుగుపల్లి, మద్దునూర్, సిరికొండ, గ్రామాల్లో గాలింపులు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.