ఘనంగా శ్రీవారి లక్ష్మీ కాసులహార శోభ యాత్ర !

J.SURENDER KUMAR,

తిరుమల శ్రీవారి లక్ష్మీ కాసులహారం శోభాయాత్ర సోమవారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం నుంచి శ్రీనివాస మంగాపురం వరకు శోభాయాత్ర వైభవంగా ప్రారంభమైంది.

శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి గరుడసేవను పురస్కరించుకుని స్వామివారికి ఈ అలంకారం చేయనున్నారు. ఈ సందర్భంగా జేఈవో శ్రీ వీరబ్రహ్మం మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామిని లక్ష్మీకాసుల హారంతో  జరుగుతుందన్నారు.


లక్ష్మీహారం శోభాయాత్ర తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనం నుండి ప్రారంభమై శ్రీ కోదండరామాలయం, రామచంద్ర పుష్కరిణి, మహతి ఆడిటోరియం మీదుగా శ్రీనివాస మంగాపురం చేరుకుంది. భజనలు, కోలాటాలతో యాత్ర కోలాహలంగా సాగింది. ఆలయ Spl Gr డిప్యూటీ ఈఓ, శ్రీమతి వరలక్ష్మి, VGO  బాలిరెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ. ఈ కార్యక్రమంలో చెంగల్ రాయలు, ఇతర అధికారులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.