గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన సీ.పీ రాధాకృష్ణన్‌ !


J.SURENDER KUMAR,

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా అదనపు బాధ్యతల్లో నియమితులైన సీపీ రాధాకృష్ణన్‌ బుధవారం బాధ్యతలు చేపట్టారు.

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్‌ అరాధే నూతన గవర్నర్‌తో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు.

రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా సాగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి పోన్నం ప్రభాకర్ , కొండా సురేఖ లు పాల్గొన్నారు. నూతన గవర్నర్‌కు సీఎం, మంత్రులు శుభాభినందనలు తెలిపారు.