👉కలెక్టర్ కు కౌన్సిలర్ జయశ్రీ వినతి పత్రం
J.SURENDER KUMAR,
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలలో భాగంగా గృహజ్యోతి పథకం లో అర్హులకు అన్యాయం జరుగుతే వారికి న్యాయం చేయాలి అని జగిత్యాల మున్సిపల్ 35 వ వార్డ్ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ బుధవారం కలెక్టర్ వినతిపత్రం ఇచ్చారు.
ప్రజాపాలన దరఖాస్తులలో కొంత మంది తెల్లరేషన్ కార్డు ఉండి, కూడ 200 యూనిట్ల విద్యుత్ వినియోగదారులైన దరఖాస్తులో టిక్ చేయకుండా, USC నెంబర్ వేయక వారికి “౦” బిల్లు రాలేదు, వీళ్ళు ఇప్పుడు వచ్చిన బిల్లు కట్టాలా ? వద్దా ? అనే సందిగ్ధంలో ఉన్నారని వినతి పత్రంలో పేర్కొంది. కొంత మంది “USC” నెంబర్ వేయకుండా మీటర్ నెంబర్ ” వేయటం వల్ల వీరికి ‘౦’ బిల్లు రాలేదు వీళ్ళు కూడ బిల్లు కట్టాలా? వద్దా ? మరికొంత మంది USC” నెంబర్ కరెక్ట్ వ్రాసినా సిస్టమ్ లో టైపు చేసినప్పుడు తప్పు కొట్టడం వల్ల ‘o’ బిల్లు రాలేదు. వీళ్ళు కూడ కట్టాలా ? వద్దా ? ఇటు వంటి సమస్యల గురించి అర్హులకు ఏం చేయలో అర్థం కాక మున్సిపల్ ఆఫీస్ చుట్టూ మరియు ఎలక్ట్రి)సిటి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. అని జయశ్రీ కలెక్టర్ కి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొంది.

మున్సిపల్ అధికారులు “ఎడిట్ ఆప్షన్ ” మాకు ఇవ్వలేదు, ప్రభుత్యం, ఆప్షన్ ఇచ్చే వరకు మేము ఏమి చేయలేము అంటున్నారు. కరెంటు అదికారులు మాది ఏమి లేదు. వాళ్ళు మున్సిపల్ లోనే చేసుకోవాలి అని సమాధానం చెపుతున్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆందోళనతో ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ చుట్టూ తిరిగి విసుగిపోతున్నారని ఆమె పేర్కొంది. కలెక్టర్ జోక్యం చేసుకొని మున్సిపల్ అధికారుల ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేసి గందరగోళానికి తెరదించాలని కౌన్సిలర్ వినతిపత్రంలో పేర్కొంది.