👉పట్టభద్రుల ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి !
J.SURENDER KUMAR,
టిపిసిసి ఎన్నికల మ్యానిఫెస్టో 2023 ( అభయ హస్తం) లో పేర్కొన్న విధంగా ‘గల్ఫ్ కార్మికుల సంక్షేమం మరియు ఎన్నారైల సంక్షేమం’ కోసం బోర్డు ఏర్పాటు చేపట్టాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి, శనివారం సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు.
గల్ఫ్ దేశాల్లో మరణించిన వారికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా కోసం తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేయాలి. గల్ఫ్ కార్మికులు ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారం కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. మరణించిన గల్ఫ్ కార్మికుని కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి,
విదేశాలలో వున్న వలస కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
జీవన్ రెడ్డి తో పాటు, గల్ఫ్ ఎన్నారై సంక్షేమ సంఘం నాయకులు డా. బిఎం వినోద్ కుమార్, చైర్మన్, టిపిసిసి ఎన్నారై, సింగిరెడ్డి నరేష్ రెడ్డి , గల్ఫ్ కన్వీనర్, టిపిసిసి ఎన్నారై సెల్,.మంద భీంరెడ్డి , కన్వీనర్, టిపిసిసి ఎన్నారై సెల్. గుండేటి గణేష్ అధ్యక్షులు, ఇండియన్ సోషల్ క్లబ్, ఓమాన్. తెలంగాణ విభాగం. సిస్టర్ లిజీ జోసెఫ్, అధ్యక్షులు, నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ నాయకులు ఉన్నారు.