జగిత్యాల జిల్లా లో నకిలీ సర్టిఫికేట్ల ముఠా అరెస్ట్ !

👉పశ్చిమ బెంగాల్ లో మూలాలు !

👉నలుగురు నిందితుల అరెస్ట్, పరారీలో ఇద్దరు !


👉ధర్మపురి పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు


👉 ఎస్పీ, సన్ ప్రీత్ సింగ్ ,


J.SURENDER KUMAR,

జగిత్యాల జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ముఠాను జిల్లా పోలీస్ యంత్రాంగం శనివారం చాకచక్యంగా నలుగురిని అరెస్టు చేసి 395 నకిలీ సర్టిఫికెట్లు ఇతర సామాగ్రిని స్వాధీన పరుచుకున్నారు. పశ్చిమ బెంగాల్లో వీటి మూలాలు వెలుగు చూడడంతో పాటు, పరారీలో ఉన్న ఆ రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితుల కోసం గాలింపు చేపట్టినట్టు జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.

👉పట్టుబడింది నిందితుల వివరాలు

1) కామెర @ బత్తినోజు రజిత w/o శ్రవణ్ కుమార్, 33 సం. లు, కులం: నేతకాని R/o H.No 9-6-338, రోడ్డు నo-2, రాంనగర్, కరీంనగర్.
2) బత్తినోజు శ్రావణ్ కుమార్ s/o అనంత చారి, 33 సం. లు, కులం: వడ్రంగి R/o H.No 9-6-338, రోడ్డు నo-2, రాంనగర్, కరీంనగర్
3) కొడిదాల మహేష్ s/o చంద్రయ్య, 27yrs, కులం : బిసి వడ్డెర, వృత్తి: కూలి, నివాసం:జైన గ్రామo, ధర్మపురి మండలం
4) కొక్కరకని చంద్రయ్య @చందు s/o దేవయ్య, 31 సం. లు , కులం: నేతకాని, నివాసం:జైన గ్రామo, ధర్మపురి మండలం.


👉పరారిలో వున్నా నిందితుల వివరాలు..

రబీ రాయ్ r/o బరహoపూర్ ,పశ్చిమ బెంగాల్ రాష్టo. 6. లక్ష్మీ రాయ్ r/o బరహoపూర్ ,పశ్చిమ బెంగాల్ రాష్టo.
నిందితులపై దర్మపురి పోలీస్ స్టేషన్ లో Cr.No.64/2024 U/Sec. 420, 465, 468, 471, 109 r/w 34 IPCకేసు నమోదు చేసి విచారణ సమగ్ర విచారణ చేస్తున్నారు
.

👉ఎస్పి తెలిపిన వివరాల మేరకు..

జైన గ్రామానికి చెందిన కొడిదల మహేష్ అనే వ్యక్తి గల్ఫ్ దేశం వెళ్ళుటకు పాస్పోర్ట్ కొరకు అతనికి పదవ తరగతి సర్టిఫికెట్ అవసరం ఉంది. మహేష్ తొమ్మిదవ తరగతి వరకే చదివినాడు. తనకు పాస్పోర్ట్ పొందుటకు పదవ తరగతి సర్టిఫికెట్ అవసరం ఉందని జైన గ్రామానికి చెందిన కొక్కరకని చంద్రయ్య @చందు ను సంప్రదించాడు. అతను తన దగ్గరి బందువు అయిన బత్తినోజు రజిత అను ఆమె నకిలీ సర్టిఫికెట్ లను ఇపిస్తుందని అని తెలుసుకొని కొక్కరకని చంద్రయ్య రజితకు ఫోన్ చేయగా తను నకిలీ సర్టిఫికెట్ ఇస్తాను దానికి బదులు ₹ 30,000/- ఇవ్వమనగా కొక్కరకని చంద్రయ్య ₹ 28,000/- ఇస్తామని చెప్పగా దానికి రజిత అంగీకారం తెలిపింది. చంద్రయ్య మహేష్ యొక్క ఆధార్ కార్డు, పూర్తి వివరములు చంద్రయ్య తన ఫోన్ నెంబర్ ద్వారా రజిత ఫోన్ కి పంపి , చంద్రయ్య , రజితకు తన ఫోన్ పే నుండి రజిత ఫోన్ పే అయిన కు ₹ 28000/- రూపాయలు పంపినాడు. 27 రోజుల తరువాత రజిత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్, రూల్ నెంబర్ 160097125873 గల నకిలీ ఓపెన్ SSC సర్టిఫికేట్ ఇప్పించినది. మహేష్ ECNR పాస్పోర్ట్ కొరకు అప్లై చేసుకోగా,SB హెడ్ కానిస్టేబుల్ R. నర్సింగ రావు పాస్ పోర్ట్ఎంక్వయిరీ కి వెళ్ళగా ఎంక్వయిరీలో అట్టి సర్టిఫికేట్ నకిలీ గా గుర్తించాడు.


కామెర @ బత్తినోజు రజిత, మరియు బత్తినోజు శ్రావణ్ కుమార్ బార్య భర్తలు, వీరిద్దరూ ప్రైవేట్ జాబ్ చేయడం వలన వచ్చే డబ్బులు వారికి సరిపోయేవి కావు. సులభoగా తక్కువ కాలం లో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే అనుకుంటున్న సమయం లో 2020 సo. లో Just Dial లో రబీ రాయ్ అనే వ్యక్తి రజితకు పరిచయం అయినాడు. రబీ రాయ్ రజితకు ఫోన్ చేసి, మీరు డిగ్రీ చేయకున్న మీరు అనుకున్న డిగ్రీ సర్టిఫికేట్ మీరు అనుకున్న యూనివర్సిటీ నుండి నకిలీ సర్టిఫికేట్ తయారుచేసి ఇస్తాను. ఈ సర్టిఫికేట్ ఒరిజినల్ లాగానే ఉంటుంది. దీనిని ఎవ్వరూ గుర్తు పట్టలేరు. దీనికి ₹ 30,000/- రుపాయలు ఖర్చు అవుతాయని చెప్పగా వీరిద్దరూ సరేనని ఒప్పుకోని అప్పటి నుండి ఏవరైన వ్యక్తులు సర్టిఫికేట్ అవసరం ఉంటె వారి దగ్గర ‘ National Institute of open Schooling’ సర్టిఫికేట్ కి ₹ 30,000/-, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కి ₹ 30,000/-, డిగ్రీ సర్టిఫికేట్ కి ₹ 40,000/-, ఇంజనీరింగ్ సర్టిఫికేట్ కి ₹ 50 వేల నుండి ₹ 60 వేల రూపాయల డబ్బులు తీసుకొని వారియొక్క పేరు, వివరాలు, వారికి అవసరమైన డిగ్రీ సర్టిఫికేట్ వారు కోరుకున్నయూనివర్సిటీ నుండి కోరుకున్న సంవత్సరం మరియు ఆ వ్యక్తి ఫోటో whatsapp ద్వారా తెప్పించుకొని అట్టి వివరాలను రబీ రాయ్ r/o బరహoపూర్, పశ్చిమ బెంగాల్ రాష్టo అనే వ్యక్తి యొక్క whatsapp నెంబర్ కు రజితయొక్క whatsapp నెంబర్ నుండి పంపగా లక్ష్మీ రాయ్ DTDC కొరియర్ ద్వారా వీరు చెప్పిన అడ్రస్ కి నకిలీ సర్టిఫికేట్ తయారు చేసి కొరియర్ ద్వారా పంపుతాడు. సర్టిఫికేట్ లు వచ్చిన వెంటనే వీరు తీసుకున్న డబ్బులలో వీరు సంగం ఉంచుకొని మిగతా సగం డబ్బులు రబీ రాయ్ తల్లి లక్ష్మీ రాయ్ అకౌంటు కి పంపేవారు. అలా ఈ మూడు మూడు సంవత్సరాలలో సుమారు 100 మందికి పైగా నకిలీ సర్టిఫికేట్ లు ఇప్పించినట్టు ఎస్పీ తెలిపారు. సందర్బాన్ని బట్టి ఒక్కో సర్టిఫికేట్ కి లక్షా ముప్పయి వేల రూపాయల వరకు తీసుకునేవారని ఎస్పీ తెలిపారు.

👉చకచక్యంగా పట్టుకున్నారు..

శనివారం నిందితులను జైన గ్రామం, ధర్మపురి మండలం , రాంనగర్, కరీంనగర్ లో వారి ఇంటి దగ్గర ఉండగా ధర్మపురి CI, రాం నరసింహా రెడ్డి, ధర్మపురి SI P. ఉదయ్ కుమార్, సిబ్బంది చా కచక్యంగా నిందితులను పట్టుకున్నట్టు ఎస్పీ వివరించారు. వారి వద్ద నుండి 395 నకిలీ సర్టిఫికేట్ లు,ఐదు సెల్ ఫోన్లు, 1- మోటార్ సైకిల్, 1- Laptop, 1-CPU, ₹ 25,000/- రూపాయల నగదు స్వాదీనపర్చుకున్నారు.
ఈ నకిలీ సర్టిఫికేట్ లు ఎక్కడెక్కడ వాడారు ? ఎంతమందికి ఇచ్చారు ? అనేది దర్యాప్తు చేస్తున్నాము. ఇప్పటి వరకు దాదాపు ₹ 15.41 లక్షల రూపాయలు రబీ రాయ్ కి రజిత ఫోన్ పే ద్వారా పంపినట్టు తాము గుర్తించామని ఎస్పీ తెలిపారు.

👉ఎస్పీ అభినందనలు..

నిందితులను పట్టుకొని 395 నకిలీ సర్టిఫికేట్లని సీజ్ చేయడం లో చాక చక్యంగా వ్యవహరించిన జగిత్యాల DSP, D. రఘుచందర్, CCS ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ధర్మపురి CI, రాం నరసింహా రెడ్డి, ధర్మపురి SI P. ఉదయ్ కుమార్,CCS SI A. నరేశ్ కుమార్, SB హెడ్ కానిస్టేబుల్ R. నర్సింగ రావు , కానిస్టేబుల్ లు J.నవీన్ కుమార్ , M.రమేష్, K.వేణు, CCS కానిస్టేబుల్ లు సిబ్బంది రమేష్, వినోద్ లను ఎస్పీ సన్ ప్రిత్ సింగ్ అభినందిచినారు.