👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా అంటే, జీవన్ రెడ్డి అని జీవన్ రెడ్డి అంటే జగిత్యాల జిల్లా అని, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
నిజామాబాద్ పట్టణంలో శనివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు పార్లమెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరును ప్రకటించిన అనంతరం జిల్లా నాయకులతో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…
జగిత్యాల జిల్లా కు జీవన్ రెడ్డి జేఎన్టియు, డిగ్రీ కళాశాల మంజూరు చేయించారని, జీవన్ రెడ్డి గ నిరంతరం పేదల పక్షాన నిలబడి ఉంటారని, తాను 2014, 2018 ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓడిపోయినప్పుడు జీవన్ రెడ్డి ఓడిన గెలిచిన ప్రజల మధ్య ఉండాలని తనకు ధైర్యం చెప్పాడన్నారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మోసపూరిత హామీలను ఇస్తు ప్రజలను తప్పుదోవ పట్టించడం జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలతో కలిసిన కుటుంబమని, ఎల్లప్పుడూ పేదల పక్షాన నిలబడే మన జీవన్ రెడ్డి ఈ సారి నిజామాబాద్ పార్లమెంట్ ఎంపిగా ప్రజల ముందుకు రావడం జరుగుతుందని, కాబట్టి పార్లమెంట్ స్థాయి కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు జీవన్ రెడ్డి ని నిజామాబాద్ పార్లమెంట్ ఎంపిగా అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే లక్ష్మి కుమార్ ముఖ్య కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు