👉అమలుకు నోచుకోని కలెక్టర్ ఆదేశాలు !
J.SURENDER KUMAR,
63 జాతీయ రహదారి పై ప్రయాణం, ప్రజల పాలిట ప్రమాదకరంగా ప్రాణాంతకంగా మారింది. ఎక్కడో రద్దీ లేని ప్రాంతంలో ఈ రహదారి పై ప్రయాణం ప్రమాదకరం కానే కాదు. ధర్మపురి క్షేత్రానికి ప్రవేశ దారి కూడలి వద్దనే విగ్రహం, అభివృద్ధి పనుల పైలాన్, హైమాస్ లైట్ ల ప్లాట్ ఫామ్ ,ఫౌంటెన్ కోసం వృత్తాకార సిమెంట్ కట్టడాలతో ఈ రహదారి ప్రజల, వాహన చోదకుల పాలిట ప్రాణాంతకంగా మారింది. తక్షణం ఆ కట్టడాలను తొలగించాలని కలెక్టర్ ఆదేశించిన ఆ ఆదేశాలు అమలుకు నోచుకోవడం లేదు.
వివరాల్లోకి వెళ్తే..
నిజాంబాద్ – జగదల్పూర్ 63 జాతీయ రహదారి జగిత్యాల, ధర్మపురి, రాయపట్నం గుండా మంచిర్యాల జిల్లా కు ప్రవేశిస్తుంది. ధర్మపురి క్షేత్ర కూడలి లో జాతీయ నాయకుడి విగ్రహం గత దశాబ్ద కాలంగా ఉంది. ఆయన జయంతి, వర్ధంతికి యువత ఘనంగా నివాళులు అర్పిస్తుంటారు.
👉గత ప్రభుత్వంలో.
.

గత బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ఈ కూడలిలో పట్టణంలో జరిగిన అభివృద్ధి పనుల పైలాన్ నిర్మించారు. ఆ పైలాన్ అప్పటి మంత్రి కేటీఆర్, తో ప్రారంభింప చేశారు. దీనికి తోడు ఈ జాతీయ రహదారి కూడలి మధ్యలో ఫౌంటెన్ కోసం సిమెంట్ దిమ్మెలతో వృత్తాకారం కట్టడం చేపట్టారు. పట్టణ సుందరీకరణలో భాగంగా ఫౌంటెన్ ఏర్పాటు చేయనున్నట్టు నాటి ప్రభుత్వ పెద్దలు వివరించారు. అసంపూర్తిగా పనులు చేపట్టి వదిలేశారు. ఇదే క్షేత్రంలో స్వాగతం తోరణం మరో కూడలి లో జాతీయ రహదారి పై నిర్మించిన డివైడర్లతో స్వాగత తోరణం లోకి వాహనాలు రాకపోకలకు, ఇబ్బందులతో పాటు అనేక ప్రమాదాలు జరుగుతున్న యంత్రాంగంలో స్పందన కరువైంది.
👉కలెక్టర్ ఆదేశించినా.. అడ్డుకుంటున్నది ఎవరు ?

ఈనెల 20న ఆరంభం కానున్న ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాలలో. భక్తుల సౌకర్యాల కల్పన కోసం ముందస్తుగా జగిత్యాల కలెక్టర్ అధ్యక్షతన దేవాదాయ, ప్రభుత్వ అధికార యంత్రాంగంతో ఈనెల 5న మంగళవారం ధర్మపురిలో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష , ముందస్తుగా జాతీయ రహదారి కూడలిలో ఆ కట్టడాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. వెంటనే వాటిని తొలగించండి అంటూ అధికారులను ఆదేశించారు. గురువారం పగలు 2 గంటల వరకు రహదారిపై ఉన్న కట్టడాలను తొలగించలేదు. తొలగించడానికి అధికార యంత్రంగా మీన వేషాలు లెక్కపెట్టడం గమనహారం . ఈ కట్టడాలను తొలగింపు అడ్డుకుంటున్నది ఎవరో అధికారులే వివరించాల్సిన అవసరం ఉంది.
👉ఆ కూడలిలో ప్రమాద సూచికలు లేవు!

నిత్యం వందలాది వాహనాలు, ద్విచక్ర వాహనదారులు, రాకపోకల కొనసాగించే ఆ కూడలిలో ముందస్తు ప్రమాద సూచికల బోర్డులు , వాహన చోదకులను అప్రమత్తం చేయడానికి రేడియం స్టిక్కర్లు కానీ రెడ్ లైట్లు లేవు. శివరాత్రి పర్వదినం తో పాటు, బ్రహ్మోత్సవాలకు నిజాంబాద్ , నాందేడ్ మహారాష్ట్ర ప్రాంతంల నుండి ఈ రహదారి గుండానే రాత్రి పగలు భక్తులు వాహనాల ద్వారా రాకపోకలు కొనసాగిస్తుంటారు.

ఇలా ఉండగా ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ ఖానాపూర్ , జన్నారం ప్రాంతాల నుండి కమ్మనూరు , కలమడుగు వంతెన ద్వారా ధర్మపురి కి రాకపోకల కొనసాగించే భక్తజనం వాహనాలకు తెనుగు వాడ వద్ద జింకల విగ్రహ నమూనాలతో ఏర్పాటు చేసిన కూడలి సైతం ప్రమాదకరంగా మారింది. జాతీయ రహదారులపై వేగం నియంత్రణకు ఫీడ్ బ్రేకర్లను ఏర్పాటుకు అనుమతించని నేషనల్ హైవే నిబంధనలు రహదారి మధ్యలో సిమెంటుతో వృత్తాకార నిర్మాణంకు అధికార యంత్రాంగం అనుమతులు ఎలా ఇచ్చారో వారే ప్రభుత్వానికి వివరించాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ స్పందించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.