కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా తెరపైకి తీన్మార్ మల్లన్న @ చింతపండు నవీన్ పేరు వచ్చినట్టు సమాచారం.
ఢిల్లీలో బుధవారం రాత్రి కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసింది.
రాష్ట్రంలో 17 స్థానాలలో ఈపాటికి 9 స్థానాల అభ్యర్థులను ఖరారు చేసింది. బుధవారం మెదక్ , నిజాంబాద్, భువనగిరి, ఆదిలాబాద్, అభ్యర్థుల ఖరారు తో కావడంతో. మొత్తం 13 స్థానాలు ఫైనల్ అయ్యాయి. మరో నాలుగు పార్లమెంటు స్థానాల అభ్యర్థుల పేర్లు ఈనెల 31న కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించనున్నట్టు సమాచారం.
ప్రత్యేకంగా కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిత్వంపై చర్చ జరిగినట్టు తెలిసింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా వినోద్ కుమార్, బిజెపి అభ్యర్థిగా బండి సంజయ్ లను ఖరారు చేస్తూ ఆ పార్టీలు ఈపాటికే ప్రకటించాయి. కాంగ్రెస్ టికెట్ కోసం అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరు ఓసి సామాజిక వర్గానికి, ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థి సైతం ఓసి సామాజిక వర్గం వాడే. బిజెపి అభ్యర్థి బీసీ సామాజిక వర్గం, దీంతో కాంగ్రెస్ అధిష్టానం కరీంనగర్ స్థానంపై బుధవారం తర్జన భర్జన పడుతు కసరత్తు చేసినట్టు సమాచారం.
దీనికి తోడు ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రకటించిన 13 స్థానాలలో కేవలం మూడు స్థానాలు బీసీలకు కేటాయించారు. బీ ఆర్ఎస్ పార్టీ 17 స్థానాలలో 6 బీసీలకు కేటాయించగా, బిజెపి 5 ఐదు స్థానాలలో బీసీ అభ్యర్థులను నిలబెట్టింది.
దీనికి తోడు తీన్మార్ మల్లన్న కెసిఆర్ ప్రభుత్వ బాధితుడు, 2021 మార్చిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పల్ల రాజేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్, తెలంగాణ జన సమితి అభ్యర్థిగా ప్రొఫెసర్ కోదండరామ్ తో పాటు మొత్తం 69 మంది పోటీ పడ్డారు.
తీన్మార్ మల్లన్న @ చింతపండు నవీన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి అందరి అంచనాలు తలకిందులు చేస్తూ లక్షకు పైగా ఓట్లను మల్లన్న సాధించి రెండవ స్థానంలో నిలిచారు. గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డికి 1,32,681/- ఓట్లు రాగ ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,08,339 ఓట్లు వచ్చాయి.
ఇదిలో ఉండగా మల్లన్న ఛానల్ పై దాడులు అక్రమ నిర్బంధాలు కేసుల నమోదు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మల్లన్న టీం ప్రచారం చేయడం, తదితర అంశాల నేపథ్యంలో కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లన్న పేరు ఫైనల్ కావచ్చు అనే చర్చ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నది.