👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్!
J.SURENDER KUMAR,
మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో ఈ దళిత ప్రజా ప్రతినిధులకు కెసిఆర్ చేసిన అవమానాలు, అన్యాయాలు బి ఆర్ ఎస్ నాయకులు మరిచిపోతే ఎలా అని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్, ప్రశ్నించారు.
,👉 హైదరాబాద్ గాంధీభవన్ లో సోమవారం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు.
👉 యాదాద్రిలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విషయంలో జరిగిన చిన్న సంఘటన ను సోషల్ మీడియాలో టిఆర్ఎస్ పార్టీ కి చెందిన నాయకులు దళితులను అవమానించారని తప్పుడు ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు.
👉 కెసిఆర్ ఇచ్చిన దళిత ముఖ్యమంత్రి హామీ,
ఆయన ప్రభుత్వంలో మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ పట్ల, ప్రవర్తన ఏ విధంగా ప్రవర్తించారో. దళిత బంధు , దళితులకు 3 ఎకరాల భూమిని పంపిణీ విషయంలో దళిత జాతిని కెసిఆర్ ఏ విధంగా మోసం చేశారో ప్రజానీకానికి తెలుసన్నారు.
👉🏻10 సంవత్సర కాలంలో మాజీ సీఎం కెసిఆర్ ను దళిత ప్రజా ప్రతినిధులే కాదు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్ని కలిసారో చెప్పాలని, అక్షర కుమార్ డిమాండ్ చేశారు. స్వయనా నేనే మా ప్రాంత సమస్యల పరిష్కారం కోసం నేరుగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పది సార్లు కలిసినట్టు వివరించారు.
👉దళిత బిడ్డ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పై పైన తప్పుడు ప్రచారం చేయడం దారుణమని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.