కొండగట్టు ఆలయ ఈవో  నాడు సేఫ్ – నేడు సస్పెండ్ !

👉నాటి విచారణ నివేదిక పెండింగ్..నేటి విచారణ నివేదికతో సస్పెండ్ ఉత్తర్వులు!

👉నాడు నేడు విచారణ అధికారి ఒక్కరే..

👉14 నెలలుగా ఈవో పై చర్యలను అడ్డుకుంది ఎవరు ?


J.SURENDER KUMAR,


ఎట్టకేలకు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టి నివేదిక ఆధారంగా దేవాదాయ  కమిషనర్ ఈవో వెంకటేష్ ను  సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అధికారిపై  నవంబర్ 2022లో  పాలకవర్గ  చైర్మన్ చేసిన ఫిర్యాదు పై అదే నెల 23న విచారణ చేపట్టి నివేదిక ను కమిషనర్ కార్యాలయం కు సమర్పించారు. నాటి విచారణ నివేదిక  పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా పెండింగ్ లో పెట్టి సేవ్ చేశారు.  ఈనెల 21 న కొండగట్టు ఆలయ ఈవో పై వచ్చిన ఆరోపణలు పై  దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ కే. జ్యోతి  విచారణ జరిపి నివేదిక అందించారు.  2022 నవంబర్ మాసంలో ఈవో వెంకటేష్  పై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టి కమిషనర్ కార్యాలయానికి నివేదిక సమర్పించింది కూడా ఈ అధికారి కావడం ప్రస్తావనవరం.  అయితే నాటి నివేదిక పై చర్యలను తీసుకోకుండా పెండింగ్ పెట్టింది ఎవరో ? నేటికీ మిస్టరీ.


👉ప్రాథమిక విచారణతో సస్పెండ్…


కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆదాయం లక్షలాది రూపాయల నిధులను ఉద్యోగి ఒకరు ఆలయ ఖాతాలో జమ చేయకుండా దాదాపు ₹50 లక్షలు సొంతానికి వాడుకున్నాడనే ఆరోపణతో బాధ్యుడైన ఉద్యోగిపై మల్యాల పోలీస్ స్టేషన్ లో ఈవో ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ జారీ చేశారు. దీంతో పాటు కొండగట్టు ఆలయంలో జరిగిన దొంగతనం సంఘటనలో దాదాపు 30 తులాల  వెండి ఆభరణాలు దొంగతనం జరిగితే. ఈవో వెంకటేష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కేవలం 16 నుంచి 20 తులాల లోపు దొంగతనం జరిగినట్టు ఫిర్యాదులో పేర్కొన్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

,👉2022 లో పాలకవర్గ చైర్మన్ ఫిర్యాదు తో ...


కొండగట్టు ఆలయంలో 2022 నవంబర్ లో హైదరాబాద్ దేవదాయశాఖ కు చెందిన అధికారిని ఏడిసి జ్యోతి మేడమ్, కరీంనగర్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్,  కొండగట్టు ఆలయంలో విచారణ జరిపారు. కొండగట్టు ఆలయ పాలకవర్గ చైర్మన్, ఉద్యోగులు, అర్చకులు, వేద పండితులు, సమయపాలన పాటించడం లేదని, నిధుల 30% పరిధి అతిక్రమించిందని, అనవసర ఖర్చులతో ఆలయానికి ఆదాయంకు గండి పడుతుందని తదితర అంశాలపై హైదరాబాదులో కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో విచారణకు నాటి కమిషనర్ ఆదేశించారు.
విచారణ చేపట్టిన అధికారులకు ఆలయ ఆదాయ, ఖర్చులకు సంబంధించిన. రికార్డులు తనిఖీ చేయగా, మినరల్ వాటర్ బాటిల్ కొనుగోళ్ళకు లక్షలాది రూపాయలు ఖర్చు చేసినట్టు నమోదయి ఉన్నట్టు తెలిసింది. ఆలయంలో ప్యూరిఫై మినరల్ వాటర్ ప్లాంట్ ఉంది. ఆలయ భూముల లీజు కు సంబంధించిన ఫైల్ ,విచారణ అధికారులకు  లభ్యం కానట్టు సమాచారం.  ఫిర్యాదు పత్రంలోని పలు అంశాలపై విచారణ చేయగా, 11 అంశాలలో వాస్తవాలు అని విచారణ అధికారులు నిర్ధారించుకున్నట్టు సమాచారం.


👉ముందస్తు అంచనాల బడ్జెట్ మంజూరు కాలేదు..


రాష్ట్ర దేవాదాయ శాఖ రాష్ట్రంలోని ఆయా ఆలయాల ఆర్థిక స్థితిగతులను పరిగణంలోకి తీసుకొని  ముందస్తు అంచనాల బడ్జెట్దే అనుమతులు జారీ చేస్తారు. అయితే కొండగట్టు ఆలయానికి ముందస్తు అంచనా బడ్జెట్ అనుమతులు రాకముందే వివిధ పద్దులకు లక్షలాది రూపాయలు ఖర్చును గుర్తించినట్టు సమాచారం. ఇట్టి ఖర్చులను ప్రతినెల ఆడిట్ చేయవలసిన అధికారులు, ముందస్తు అంచనాల బడ్జెట్ మంజూరు కానందున ఆడిట్ చేయడానికి అధికారులు నిరాకరించినట్టు విచారణలో వెలుగు చూసింది.


👉ముందస్తు అంచనా బడ్జెట్ అంటే !


రాష్ట్రంలో ఆయా ఆలయాల ఆర్థిక స్థితిగతుల నేపథ్యంలో. కార్యనిర్వహణాధికారులు ఆర్థిక సంవత్సరంకు నెలరోజులు ముందుగానే. ఆలయంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలు పద్దులకు సంబంధించిన ఖర్చు చేయాల్సిన నిధుల వివరాలను దేవాదాయ శాఖ కమిషనర్ కు నివేదిక అందిస్తారు.  కమిషనర్ ఆమోదంతో ఉత్సవాలకు ఇంత మొత్తం, విఐపి ల ఖర్చులు, పత్రికా ప్రకటనలు, చలువ పందిళ్లు, విద్యుత్ దీపాల అలంకరణ, ఉద్యోగులకు అడ్వాన్సులు, తదితర అంశాలపై, ఇంత మొత్తం నగదుకు మించి. ఖర్చు చేయరాదు అంటూ, ఆయా అంశాలకు నిర్దిష్టమైన బడ్జెట్ ను కేటాయిస్తారు.  ఆలయ ఆదాయంలో ఇంత శాతం ఆలయం పేరుతో డబ్బులను ఫిక్స్ డిపాజిట్ చేయాలంటూ తదితర అంశాలతో పాటు విధివిధానాలను తెలియజేస్తూ ఆర్థిక సంవత్సరంకు వారం రోజులు ముందుగా ముందస్తు అంచనాల బడ్జెట్ మంజూరి అనుమతులు జారీ చేస్తారు. అయితే 2022 నవంబర్ 23న విచారణ చేపట్టిన అధికారులకు బడ్జెట్ కు సంబంధించిన అనుమతి ఉత్తర్వులు లభ్యం కాలేదు .


👉 కోవిడ్ లో కొండగట్టు ఆలయంలో అవినీతి అనకొండలు.

!


కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం 2020 ఆర్థిక సంవత్సరంలో, 202 (రెండు వందల రెండు) రోజులపాటు మూసి ఉన్న, నిర్వహణ పేరిట లక్షలాది రూపాయల ఖర్చులు  చేశారు,  ఎవరి కోసం చేశారో.? అంతు పట్టని మిస్టరీ. రికార్డులలో నమోదైన ఖర్చుల వివరాలు
తేదీ.11-10-2020  నుంచి .31-3-2021 వరకు ఆలయం తెరిచి ఉంది.  తిరిగి తేది 1-4-2021 నుంచి  30-6-2021, వరకు లాక్ డౌన్ విధించారు (ఆలయాలు మూసి ఉన్నాయి) 


👉కొన్ని పద్దులలో ఖర్చుల వివరాలు ఇలా ఉన్నాయి!


తడుకలు మరియు పందిళ్లు ₹ 3,24,706/-  కేశఖండన శాల నిర్వహణ  ₹ 1,36,209/-   శ్రీ హనుమాన్ జయంతి ₹ 2,07,255/-   వార్షిక పండుగలు ₹ 3,07,755/- . విద్యుత్తు దీపాలంకరణ  ₹ 86,800/-    కరెంటు సామాగ్రి 500/-  వాటర్ సప్లై సామాను ఖరీదు నిర్వహణ ₹ 1,31,973/-  యం  అండ్  ఆర్ వర్క్స్  ₹1,73,986/-  గోశాల నిర్వహణ ₹ 1,20,350/-  టి ఏ మరియు డి ఏ బిల్లులు  ₹ 4,880/-  కారు అలవెన్స్ ₹ 2,94,500/-   నూతన కట్టడాలు  ₹ 15,36,424/-  కరెంటు & వాటర్ సప్లై సామాగ్రి  ₹,1,84,305/-. కరెంటు సామాగ్రి ఖరీదు ₹ 89,000/- ఆగమ పాఠశాల నిర్వహణ  ₹ 4,06,152/-  గార్డెన్ నిర్వహణ. ₹ 2,880/- తదితర వాటికి (కొన్ని మాత్రమే) ఖర్చు చేసినట్టు   ఆలయ రికార్డులలో నమోదయింది.


👉ఆలయం మూసి ఉన్న ఆ ఖర్చులు ఎవరికోసం ?


కరోనా నేపథ్యంలో మూసి ఉన్న ఆలయంలో వీఐపీ ప్రోటోకాల్, ధర్మకర్తల టి ఏ డి ఏ, ధర్మశాల నిర్వహణ, చలివేంద్రాలు, పేరిట రికార్డులలో ఎలాంటి ఖర్చులు నమోదు  చేయనట్టు సమాచారం. .అయితే వాటర్ సప్లై సామాగ్రి ఖరీదు నిర్వహణ పేరిట.₹ 1,31,973/-ఖర్చు అయినట్టు నమోదు చేయగా, మరోసారి కరెంటు మరియు వాటర్ సప్లై సామాగ్రి కొనుగోలు పేరిట ₹ 1,84,305/-  అదనంగా కరెంటు సామాగ్రి కొనుగోలు పేరిట ₹ 89,000/- ఖర్చుల వివరాలు నమోదు చేశారు.
దీనికి తోడు. అధికారి కారు అలవెన్స్ పేరిట ₹ 2,94,500/-  డిఎడిఎ బిల్లులు 4,880/- గార్డెన్ నిర్వహణ పేరిట ₹ 2,880/- ఫర్నిచర్ కొనుగోలు పేరిట ₹24,010/- కరోనా, లాక్ డౌన్ లో ఆగమ పాఠశాల నిర్వహణ ఎలా  జరిగింది ?  నిర్వహణ పేరిట ₹ 4, 06,152/- ఖర్చు అయినట్లు నమోదు చేయడం తో కోవిడ్ లో కొండగట్టు ఆలయంలో అవినీతి అనకొండలు ఎవరో అధికారుల విచారణ జరిపి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.